
అషూ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తరచూ తన హాట్ అండ్ గ్లామరస్ ఫోటోషూట్లతో ట్రెండ్ చేస్తూ ఉంటారు. తాజాగా మయామీలో ఆమె చేసిన ఫోటోషూట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వైట్ ఆఫ్ షోల్డర్ ఫ్రాక్‌తో పాటు, గ్రాసీ గ్రీన్ బెల్ట్‌తో అదిరిపోయే లుక్‌ను ప్రదర్శించిన అషూ, తన స్టైలిష్ ప్రెజెన్స్‌తో అభిమానుల హృదయాలను దోచుకుంటోంది.
ఈ ఫోటోల్లో అషూ లుక్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. క్లాసీ డ్రెస్‌కు తగినట్లుగా ఆమె ఇచ్చిన కూల్ ఎక్స్ప్రెషన్స్, నడుము వద్ద ఉన్న బెల్ట్ హైలైట్ అవుతూ ఆ ఫ్రేమ్‌ను మరింత స్టన్నింగ్‌గా మార్చింది. ఆమె ధైర్యంగా, కాన్ఫిడెంట్‌గా ఇచ్చిన పోజులు చూసిన నెటిజన్లు “అషూ యూ లుక్ కిల్లర్!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కెరీర్ విషయానికొస్తే, యాంకర్‌గా, యాక్ట్రెస్‌గా, సోషల్ మీడియా సెలబ్రిటీగా అషూ గుర్తింపు పొందింది. బిగ్ బాస్ 3 తెలుగు షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత ఆమె యూట్యూబ్ షోలు, డ్యాన్స్ రీల్స్, షార్ట్ ఫిలింలతో ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ మయామీ ఫోటోషూట్‌కి సంబంధించిన ఓ ఫోటోకి “మంచి మనసు ఉన్నవారు ఎప్పుడూ అందంగా కనిపిస్తారు” అనే క్యాప్షన్ పెట్టిన అషూ, తన గ్లామర్‌తో పాటు మైండ్‌సెట్‌ను కూడా చాటిచెప్పింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇదే స్పీడ్‌తో పోతే, త్వరలోనే ఓటీటీ ప్రాజెక్టుల్లో ఆమెను రొమాంటిక్ గ్లామర్ రోల్స్‌లో చూడవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Recent Random Post:















