ఆ సినిమాకి గ్రీన్ సిగ్నెల్..ఆపాల‌ని ట్రై చేసినా ప‌న‌వ్వ‌లే!

స‌రిగ్గా సినిమాల రిలీజ్ స‌మ‌యంలో ఊహించ‌ని వివాదాలు తెర‌పైకి వ‌స్తుంటాయి. షూటింగ్ చేసుకున్నంత కాలం ఎలాంటి అడ్డంకులుండ‌వు. రిలీజ్ కి వ‌చ్చే స‌రికి వివాదం చుట్టుముట్ట‌డం కోర్టుల్లో కేసు..వాద‌న‌లు అంటూ క‌థ అప్ప‌టిక‌ప్పుడు అడ్డం తిర‌గుతుంటుంది. ఓ ర‌కంగా ఇలాంటి కేసులు సినిమాల‌కు కోట్ల రూపాయ‌ల ఉచిత ప‌బ్లిసిటీని సైతం తెచ్చిపేట్టేవే.

తాజాగా `మ్యాచ్ ఫిక్సింగ్ – ది నేషన్ ఎట్ స్టేక్’ సినిమా విడుదలను ఆపాలంటూ లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ చేసిన విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఈ చిత్రం తన ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుందని , తన విచారణను ప్రభావితం చేస్తుందని పురోహిత్ వాదించారు. అయితే చిత్ర నిర్మాత ఇది పూర్తిగా కల్పితమని, ఎవ‌రి పైనా ఈ ప్ర‌భావం చూప‌దంటూ కౌంట‌ర్ దాఖ‌లు చేసారు.

దీంతో కౌట‌ర్ వైపే జ‌డ్జిమెంట్ వ‌చ్చింది. ఏళ్ల తరబడి పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న ఓ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందిందని కోర్టు స్పష్టం చేసింది. భారతదేశంలోని న్యాయమూర్తులు కల్పిత రచనల ద్వారా ప్రభావితం అవుతారనే అసంబద్ధ వాదనను కొట్టేసింది. కేసు విచారణ అనేది సినిమా పై ఎటువంటి ప్రభావం చూప‌ద‌ని బెంచ్ స్ప‌ష్టం చేసింది.

అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు సినిమాపై స్టే విధించాలని పురోహిత్ తరపు న్యాయవాది చేసిన మ‌రో అభ్యర్థన కూడా కోర్టు తిర‌స్క‌రించింది. రాజకీయ సంఘటనల కారణంగా కళల ప్రవాహాన్ని ఇది పరిమితం చేయదని బెంచ్ పేర్కొంది. ఇదే చిత్రం ముస్లిం సమాజానికి అభ్యంతరకరంగా ఉందని పేర్కొంటూ నదీమ్ ఖాన్ దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా ఇంత‌కు ముందే దాఖ‌లైంది. అయితే క‌ల్న‌ల్ ప్ర‌సాద్ వేసిన కేసు కార‌ణంగా ఈ అంశం మ‌ళ్లీ తె ర‌పైకి రాగా దీన్ని కూడా కొట్టేసారు.

అయితే ఈ అంశాల‌పై సోష‌ల్ మీడియాలో భిన్న‌వాదన‌లు వినిపిస్తున్నాయి. కొంతమంది సృజనాత్మక స్వేచ్ఛకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. మ‌రికొంత మంది న్యాయవ్యవస్థ తీరును త‌ప్పు బ‌డుతున్నారు. ఇంకొంత‌ మంది సున్నిత‌మైన సంఘ‌ట‌న‌ల విష‌యంలో క‌ల్ప‌న అన్న‌ది స‌హేతుకం కాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. న్యాయ స్వాతంత్రం చాలా ముఖ్యమైనదని, సినిమాలు విచారణలను నిర్దేశించవని మ‌రో యూజ‌ర్ పోస్టు పెట్టారు.


Recent Random Post: