తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన మార్క్ చాటుతూ వస్తున్నారు నాజర్. ఆయన ఎలాంటి పాత్ర చేసినా సరే దానికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. సౌత్ అన్ని భాషలతో పాటుగా హిందీలో కూడా ఆయన నటించారు. ఇండియన్ సినీ ప్రేక్షకులకు నాజర్ చాలా సుపరిచితుడు. ఆయన ఏ సినిమాలో కనిపించినా.. ఏ పాత్ర చేసినా పాత్రకు ఒక నిండుతనం తీసుకొస్తారు. అయితే నాజర్ తెర మీద అంత బాగా కనిపిస్తున్నా ఆయన మనసు మొత్తం బాధతో ఉంటుందని తెలుస్తుంది.
అదేంటి అలా ఎందుకు అంటే.. సెలబ్రిటీల జీవితాలు మనం తెర మీద చూసి వారిది చాలా అద్భుతమైన జీవితం.. విలాసవంతమైనది అనుకుంటాం కానీ వారి జీవితాల్లోకి ఒకసారి తొంగి చూస్తేనే అసలు విషయం అర్థమవుతుంది. నాజర్ జీవితంలో కూడా ఒక విషాదం ఆయన్ను జీవితాంతం బాధ పడేలా చేసింది. నాజర్ కి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు నూరుల్ హాసన్, లుప్తీన్, అభి మెహ్తీ హాసన్.
వీరిలో పెద్ద కొడుకు నూరుల్ హాజన్ అలియాస్ అబ్దుల్ వైజల్ హాసన్ హీరోగా మారాలని అనుకున్నాడు అతన్ని హీరోగా లాంచ్ చేసే టైం లో అతనికి కారు ప్రమాదం జరిగింది. ఆ యాక్సిడెంట్ లో అబ్దుల్ తలకు బలంగా దెబ్బ తగలడం వల్ల అతను గతాన్ని మర్చిపోయాడు. గతం గుర్తు లేని అతను తన తల్లిదండ్రులను కూడా గుర్తు పట్టలేని స్థితికి వచ్చాడట. కన్న కొడుకు తమని గుర్తు పట్టలేని పరిస్థితిని చూసి నాజర్ చాలా బాధపడ్డారు. కేవలం కొడుకు ప్రాణాలతో ఉన్నాడనే సంతోషం తప్ప జీవచ్చవంలా ఉన్న కొడుకుని చూసి నాజర్ రోజు లోలోపల ఎంతో బాధపడుతుంటారు.
2014 లో ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి నాజర్ కొడుకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంట్లో అంత బాధ ఉన్నా సరే నాజర్ తన కెరీర్ కి గ్యాప్ ఇవ్వలేదు. ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తూ యాక్టివ్ గా ఉన్నారు. నాజర్ కొడుక్కి కేవలం తమిళ హీరో విజయ్ ఒక్కడే గుర్తు ఉన్నాడట. అందుకే ఒకసారి అతని పుట్టినరోజు కోసం విజయ్ ని ఆహ్వానించి అతన్ని ఆనందపరిచారు. నాజర్ గురించి ఈ విషయం తెలిసిన సినీ ప్రేక్షకులు నాజర్ కి హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు.
Recent Random Post: