ఇన్‌స్టంట్ కాఫీలా ఇదేంటి సామ్?

సమంత రూత్ ప్ర‌భు.. వ్య‌క్తిగ‌తంగా వృత్తిగ‌తంగా ఎమోష‌న‌ల్ జ‌ర్నీని బ్యాలెన్స్ చేస్తున్న తీరు ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. కొన్ని ఎదురు దెబ్బ‌లు తిన్నా అవేవీ త‌న కెరీర్ ని ప్ర‌భావితం చేయ‌కుండా సామ్ ఎంతో జాగ్ర‌త్తప‌డుతోంది. త‌న జీవితంలో ప్ర‌తి నిమిషం ఆనందాన్ని ఉద్వేగాన్ని దాచుకోకుండా ప్ర‌తిసారీ సోష‌ల్ మీడియాల్లో ఓపెన‌వుతూనే ఉంది.

తాజాగా సోష‌ల్ మీడియాలో ఒక అంద‌మైన ఫోటోని షేర్ చేసింది. ‘ఇన్‌స్టంట్ కెమెరా ఫేస్’ అని దీనికి క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ ఫోటోలో కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ క‌నిపించింది స‌మంత‌. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఇన్ స్టంట్ కాఫీలా ఇన్ స్టంట్ క్లిక్ ఎంతో అందంగా కుదిరింది. బ్యాక్ గ్రౌండ్ లైటింగ్ స్కీమ్ ఈ ఫోటోని ప్ర‌త్యేకంగా మార్చింది. బిస్కెట్ క‌ల‌ర్ దుస్తుల‌కు త‌గ్గ‌ట్టుగా నేప‌థ్యంలో కాంతి ఇంచుమించి అదే రంగులో క‌లిసిపోవ‌డంతో యాంబియెన్స్ ప్ర‌త్యేకంగా మారింది.

ఇక త‌న క్యాప్ష‌న్ లో ‘అడపాదడపా ఉపవాసం’ అని రాసింది. అయితే ఉపవాస ధీక్ష దేనికోసం? బ‌య‌ట వండిన‌వి తిన‌కూడ‌ద‌ని కూడా స‌మంత సూచించింది. చాలా కాలంగా సమంత తనకు డెర్మటోమయోసిటిస్‌తో బాధపడుతున్న సంగ‌తి తెలిసిందే. దీనికోసం అమెరికా స‌హా ప‌లు దేశాల్లో చికిత్స తీసుకుంది. నిరంత‌రం జిమ్ చేస్తూ ఆహార‌నియ‌మాలు పాటిస్తూ త‌న అనారోగ్య స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో విజ‌యం సాధించింది. మంచి ఆహార నియ‌మాలు, క‌ఠిన వ్యాయామం, సంతోషంగా ఉండ‌డం త‌న‌ని తిరిగి కోలుకునేలా చేస్తోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సమంత న‌టించిన ఖుషి ఇప్ప‌టికే రిలీజైంది. కొంత గ్యాప్ తీసుకుని మ‌యోసైటిస్ చికిత్స‌ను కొన‌సాగించింది. ఇప్పుడు తిరిగి ప‌ని(న‌ట‌న‌)లో చేర‌బోతోంది. త‌దుప‌రి ‘సిటాడెల్’ ఇండియా వెర్ష‌న్ ప్ర‌మోష‌న్స్ కోసం స‌మంత సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలిసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ యువ‌హీరో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది. తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే దీనికి క‌ర్త‌లు. అలాగే స‌మంత త‌న తొలి హాలీవుడ్ చిత్రంలో న‌టించాల్సి ఉంది. ‘ఓ బేబి’ (స‌మంత క‌థానాయిక‌) నిర్మాత‌లు దీనిని నిర్మిస్తారు.


Recent Random Post: