ఇవన్నీ బన్నీ బిజినెస్ లే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు చేతులా సంపాదనే. `పుష్ప` సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో! అతని మార్కెట్ మరింత విస్తృతమైంది. బ్రాండ్ ఇమేజ్ రెండింతలు పెరిగింది. దీంతో బ్రాండింగ్స్ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుంది. సినిమాల ద్వారా వచ్చే ఆదాయం వస్తూనే ఉంది. `పుష్ప` రెండు భాగాలకు కలిపి భారీ మొత్తంలో ఛార్జ్ చేసారు. అలాగే అప్ కమింగ్ ప్రాజెక్ట్ లకు సంబంధించి భారీ ఎత్తున అడ్వాన్సులు అందుకున్నట్లు సమాచారం.

మరి ఈ డబ్బంతా బన్నీ ఏం చేస్తున్నట్లు అంటే? వ్యాపార రంగంలోనూ ఐకాన్ స్టార్ దూసుకుపోతున్నాడు. వివిధ బిజినెస్ ల్లో పెట్టుబడులు పెడుతూ అక్కడా సక్సస్ ఫుల్ గా రన్నింగ్ లో ఉన్నాడు. ఇటీవలే అమీర్ పేట్ లో `ఏఏఏ` పేరుతో భారీ మల్టీప్లెక్స్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఏషియన్ గ్రూప్ తో కలిపి ఈ మాల్ ని ప్రారంభించినా బన్నీ భాగస్వామ్యమే కీలకమని తెలుస్తోంది.

ఈ మాల్ ని ఎంతో అధునాతనంగా నిర్మించారు. ఫస్ట్ క్లాస్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. ఇక జూబ్లీహిల్స్ లో ఒక ఫ్రెండ్ తో కలిసి పబ్ లో పెట్టుబడి పెట్టినట్టు తెల్సుతుంది. ఇక బన్నీ పేరిట తాతయ్య అల్లు రామలింగయ్య జ్ఞాపకార్ద `అల్లు` స్టూడియో ఒకటి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డబ్బింగ్ స్టూడియోలు పరిమితంగా ఉన్న నేపథ్యంలో దీన్ని తెరపైకి తేవడం చాలా సినిమాలకు ఉపయుక్తంగా మారింది.

అలాగే `ఆహా` ఓటీటీలో కూడా బన్నీ తండ్రి తో పాటు కొంచెం పెట్టుబడి పెట్టాడు. తన స్టార్ డమ్ నే పెట్టుబడిగా పెడుతున్నాడు. ఆహా కోసం కోట్ల రూపాయల పబ్లిసిటీని అందిస్తున్నాడు. ఇవి గాక సిటీలో ఖరీదైన ప్రాంతాల్లో స్థలాలు గెస్ట్ హౌస్ లు కొనుగోలు చేసినట్టు తెల్సుతుంది. సినిమా వాళ్ల పార్టీలు కూడా తరుచూ అక్కడ జరుగుతాయట. వీటి ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని సమాచారం. వీటి నిర్వహణ మాత్రం ఆయన సన్నిహితులు చూసుకుంటారని తెలుస్తోంది.


Recent Random Post: