గత ఏడాది డిసెంబర్ లో తెలుగు బాక్సాఫీస్ వద్ద అఖండ మరియు పుష్ప సినిమాలు సందడి చేసిన విషయం తెల్సిందే. కానీ ఈ ఏడాది పెద్ద సినిమాలు ఏమీ లేవు. చిన్న సినిమాలు డబ్బింగ్ సినిమాలు మాత్రమే డిసెంబర్ లో సందడి చేస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు లేకున్నా మంచి కాన్సెప్ట్ సినిమాలు వస్తే తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తారని పలు సార్లు నిరూపితం అయ్యింది.
ఈ వారం తెలుగు బాక్సాఫీస్ వద్దకు పలు సినిమాలు రాబోతున్నాయి. డిసెంబర్ 9వ తారీకున తమన్నా.. సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా తో పాటు ప్రేమ దేశం.. ఆక్రోశం.. చెప్పాలని ఉంది.. పంచతంత్రం.. ముఖ చిత్రం.. సివిల్ ఇంజనీర్ సినిమాలు కూడా రాబోతున్నాయి.
ఈ సినిమాల్లో గుర్తుందా శీతాకాలం సినిమా కన్నడ సినిమాకు రీమేక్ అనే విషయం తెల్సిందే. ఇక ప్రేమ దేశం సినిమా కూడా ఒక కన్నడ సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సినిమాలకు సంబంధించిన బజ్ పాజిటివ్ గా ఉంది.
ఇక సివిల్ ఇంజనీర్ సినిమా మాత్రం కన్నడ సినిమాకు డబ్బింగ్ వర్షన్. ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. మొత్తానికి ఈ వారంలో బాక్సాఫీస్ వద్దకు రాబోతున్న సినిమాల్లో కన్నడ సినిమాల జోరు ఎక్కువగా ఉంది.
కేజీఎఫ్ సినిమా తర్వాత కన్నడ సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఒకప్పుడు తమిళ సినిమాలు మాత్రమే రీమేక్ మరియు డబ్ అయ్యేవి. కానీ ఇప్పుడు కేజీఎఫ్ మరియు కాంతార సినిమాల వల్ల కన్నడ సినిమాల స్థాయి పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కనుక ఈ వారం తెలుగు ప్రేక్షకులను కన్నడ సినిమాల యొక్క రీమేక్ లు మరియు డబ్బింగ్ వర్షన్ లు ఎంటర్ టైన్ చేస్తాయేమో చూడాలి.
Recent Random Post: