ఎంఎస్ నారాయణ చివరి క్షణాలు – బ్రహ్మానందం ఎమోషనల్ మెమొరీ!

Share


టాలీవుడ్ బెస్ట్ కమెడియన్స్ లిస్టులో ఎంఎస్ నారాయణ పేరు తప్పకుండా ఉంటుంది. ఆయన ఇక లేరన్నా, నిత్యం మనం చూసే పాత సినిమాల్లో ఆయన ప్రెజెన్స్ ఇప్పటికీ బ్రతికే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా తాగుబోతు పాత్రల్లో ఆయన పెర్ఫార్మెన్స్‌కు సమానమైనది మరెవరూ అందించలేరనడం తప్పు కాదు.

అలాంటి గొప్ప నటుడి చివరి క్షణాలు ఎలా గడిచాయనేది కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే తెలుసుకోవచ్చు. తాజాగా బ్రహ్మానందం, బ్రహ్మ ఆనందం ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.

ఎంఎస్ నారాయణ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు, బ్రహ్మానందం గారు గోపీచంద్ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అప్పుడు ఆయన కూతురు ఫోన్ చేసి, “నాన్న మీరు ఒక్కసారి రాకపోతే కష్టంగా ఉంది” అంటూ, ఎంఎస్ నారాయణ బ్రహ్మానందంను చూడాలని కోరుకున్నారంటూ తెలియజేశారు. వెంటనే ఎవరికీ చెప్పకుండా బ్రహ్మి హుటాహుటిన హాస్పిటల్‌కు వెళ్లిపోయారు.

మంచం దగ్గరికి వెళ్లగానే, ఎంఎస్ నారాయణ బ్రహ్మానందం చేయిని గట్టిగా పట్టుకున్నారు. మాట్లాడలేకపోయినా, భావాన్ని వ్యక్తం చేశారు. బ్రహ్మానందం, “ఎంత డబ్బయినా ఖర్చయినా సరే, నయం చేయండి” అని డాక్టర్లకు చెప్పి షూటింగ్‌కు బయలుదేరారు. కానీ మధ్యలోనే ఆయన కన్నుమూశారని వార్త వచ్చింది.

దురదృష్టవశాత్తు, ఎంఎస్ నారాయణ ఉన్నారో, లేరో అన్న నిర్ధారణ లేకుండానే యూట్యూబ్ ఛానళ్లు థంబ్‌నైల్స్ పెట్టేసి అభిమానులను కలచివేశాయి. చివరి క్షణంలో ఆయన చేయిపట్టుకోవడం జీవితంలో మర్చిపోలేని సంఘటనగా బ్రహ్మానందం భావిస్తున్నారు.

ఈ ఇద్దరూ కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్లలో నవ్వులు పండించారు. స్టార్ హీరోలు పిలిచి మరీ ఎంఎస్ నారాయణతో తమ సినిమాల్లో నటించేవారు. టాలీవుడ్‌లో లెజెండరీ హాస్యనటుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.


Recent Random Post: