ఎన్టీఆర్ vs నాగార్జున: ఆగస్టు 14న మాస్ విలన్ల ఘర్షణ!

Share


ఈ ఆగస్ట్ 14న తెలుగు సినీ ప్రేమికులకు డబుల్ ట్రీట్ రానుంది. ఎందుకంటే అదే రోజున రెండు భారీ సినిమాలు – వార్ 2 మరియు కూలీ – రిలీజ్‌కి సిద్ధమయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు చిత్రాల్లోనూ మన టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, నాగార్జునలు నెగటివ్ రోల్స్‌లో కనిపించబోతున్నారు!

వార్ 2లో మాస్ మాన్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయబోతున్నాడు. ఇది హృతిక్ ఫైటింగ్ స్టైల్‌కి ఎన్టీఆర్ మాస్ అప్పీల్ మిక్స్ అయి ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఈ సినిమాలో తారక్ విలన్‌గా కనిపిస్తాడని బలమైన టాక్ ఉంది.

ఇంకొవైపు అదే రోజున విడుదలవుతున్న కూలీలో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి కింగ్ నాగార్జున నెగటివ్ పాత్రలో కనిపించనున్నాడు. దర్శకుడు లోకేష్ కనకరాజ్, నాగార్జునను ఒప్పించేందుకు ఏకంగా 7 సార్లు కథ వినిపించాడట. నాగ్ విలన్‌గా కనిపించడం నిజంగా డెయిరింగ్ స్టెప్ అయినా, లోకేష్ టేకింగ్ మీద నమ్మకంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదలవడం, మన ఇద్దరు స్టార్ హీరోలు నెగటివ్ రోల్స్‌లో కనిపించడం వల్ల సినిమాలపై అంచనాలు తెలుగులో భారీగా పెరిగిపోయాయి. వార్ 2 తెలుగు రైట్స్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తీసుకోగా, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇక చివరికి ప్రశ్న ఏంటంటే – ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్‌ను షేక్ చేస్తాడా? లేక నాగార్జున కూలీలో విలన్‌గా కొత్త హైప్ క్రియేట్ చేస్తాడా? ఆగస్ట్ 14న మనం క్లారిటీకి వస్తాం. రెండు సినిమాల మధ్య ఎవరి క్యారెక్టర్ ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాలి!


Recent Random Post: