కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇటీవలే నిర్మాత బండ్ల గణేష్ రెండవ సారి కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఇదే సమయంలో ఎఫ్ 3 చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడి కూడా కరోనా బారిన పడ్డట్లుగా సమాచారం అందుతోంది. రేపటి నుండి మైసూర్ లో జరగాల్సిన ఎఫ్ 3 సినిమా షూటింగ్ ను వాయిదా వేస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయం బయటకు వచ్చింది.
అనీల్ రావిపూడి ఇటీవల కొందరు వ్యక్తులను కలవడం జరిగింది. ఆ సమయంలో ఈయనకు వైరస్ సోకి ఉంటుందని అంటున్నారు. ఎఫ్ 3 సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ తో ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న దర్శకుడు అనీల్ రావిపూడి కి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో షూటింగ్ నిలిచి పోయింది. షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో సినిమా ను ముందుగా చెప్పినట్లుగా ఆగస్టులోనే విడుదల చేస్తామని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వెంకీ మరియు వరుణ్ లతో పాటు ఈ సినిమాలో సునీల్ చేసే కామెడీ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అంటున్నారు.
Recent Random Post: