ఎమోషనల్ హైపుతో అర్జున్ సన్నాఫ్ వైజయంతీ రెడీ!

Share


అర్జున్ సన్నాఫ్ వైజయంతీ – నందమూరి కల్యాణ్ రామ్ కొత్త చిత్రం, డెవిల్ తర్వాత అతడు నటిస్తున్న తాజా ప్రాజెక్ట్. ఈ చిత్రంతో ప్రదీప్ చిలుకూరి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. యాక్షన్, ఎమోషన్స్ మేళవిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొదట్లో ఈ సినిమాపై అంతగా హైప్ లేకపోయినా, టీజర్ విడుదలైన తర్వాత చిత్రంపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. సినిమా రిలీజ్ సమీపిస్తుండటంతో ప్రమోషన్స్ వేగంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా హీరో కల్యాణ్ రామ్ సినిమాలోని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటూ అందరిలో ఆసక్తిని పెంచుతున్నారు.

ప్రత్యేకంగా సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ – “ఈ చిత్రానికి 20 నిమిషాల పొడవైన క్లైమాక్స్ ఉంది. ఇది మా సినిమాకు మెయిన్ హైలైట్. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి క్లైమాక్స్ సీన్ రాలేదు. ఈ సీన్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. తల్లిని ప్రేమించే ప్రతి కొడుకు కళ్లలో కంటతడి వచ్చేలా ఉంటుంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు – నిజంగా ఇది ఎంతో ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది” అని కల్యాణ్ రామ్ తెలిపారు.

ఈ సినిమాలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆమె కల్యాణ్ రామ్ తల్లిగా నటించడం విశేషం. ఆమె ఇప్పటికే ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ – “ఈ సినిమాలో కల్యాణ్ రామ్ నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు” అని తెలిపారు. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.


Recent Random Post: