ఎవరూ చేయని పని చేసి చూపించిన ఉప ముఖ్యమంత్రి పవన్!


పదవులు ఎప్పుడూ ఒక మనిషికి ప్రత్యేకతను ఇవ్వవు, కానీ ఆ పదవిలో ఉన్న వ్యక్తి తన కృషి, ఆచరణలతో ఆ పదవికి గుర్తింపు తీసుకురావాలి. దేశవ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రులు అనేక మంది ఉన్నా, ఆ గౌరవం, ప్రాధాన్యం, పవర్ పొందుతున్న ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్ అని భావించేవారు రోజు రోజుకూ పెరుగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తక్షణ స్పందనతో, సమస్యలపై తన స్పష్టతతో ప్రత్యేకతను చాటుతున్నారు. ఇటీవల ఉమ్మడి కడప జిల్లాలో చోటుచేసుకున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి ఘటనలో పవన్ చర్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అరెస్టుకు తక్షణ ఆదేశాలు జారీ చేయడం, దాడికి గురైన జవహర్ బాబును వ్యక్తిగతంగా పరామర్శించడం, కుటుంబానికి మద్దతు ఇవ్వడం వంటి చర్యలు ప్రజల్లో ఆయనపై విశ్వాసాన్ని పెంచుతున్నాయి.

జవహర్ బాబుకు రిటైర్ అయిన తర్వాత కూడా ముప్పు ఉందని తెలుస్తే, పవన్ కల్యాణ్ ఆ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాడికి పాల్పడిన ప్రతి నిందితుడిని అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీకి స్పష్టం చేయడం, ఎలాంటి రాజీపడకుండా చట్టపరమైన చర్యలకు కట్టుబడడం పవన్‌ను మరింత శక్తివంతమైన నాయకుడిగా నిలిపింది.

తాను నిర్వహిస్తున్న మునిసిపల్ శాఖలో సమస్యలను పరిష్కరించడంలో చూపిన నిష్ఠ, అలాగే ఎంపీడీవో ఘటనపై తీసుకున్న నిర్ణయాల్లో అదే స్థాయిలో పట్టుదల, పవన్ కల్యాణ్ తన పాత్రను ఎంత బలంగా నిర్వహిస్తున్నారో చూపిస్తోంది. ఒక ఘటన జరిగిన వెంటనే దానిపై స్పందించి, సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకోవడం, సమస్య వెనుక ఉన్న అసలు కారణాలను గుర్తించడం పవన్ ప్రత్యేకత.

ఇలా తక్షణ స్పందన, చట్టపరమైన నిర్ణయాలు, ప్రగతిశీల ఆలోచనలతో పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రులలో అత్యంత పవర్‌ఫుల్ నాయకుడిగా నిలుస్తున్నారని ప్రజలు విశ్వసిస్తున్నారు.


Recent Random Post: