
కాపీరైట్ వివాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్‌కు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రంలోని ‘వీర రాజ వీర’ పాటకు సంబంధించి కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు రావడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.
భారత శాస్త్రీయ గాయకుడు ఫయాజ్ వాసిపుద్దీన్ ఠాకూర్ 2023లో ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆయన తండ్రి నజీర్ ఫయాజుద్దీన్ ఠాకూర్ మరియు మామ జహీరుద్దీన్ ఠాకూర్ రచించిన ఓ శివ స్తుతి పాటను, రెహమాన్ ‘వీర రాజ వీర’ పాటగా కాపీ చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పిటీషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి, రెహమాన్ మరియు చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ పై రూ.2 కోట్ల జరిమానా విధిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ రెహమాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం, సింగిల్ జడ్జి ఉత్తర్వులకు మద్యంతర స్టే ఇచ్చింది. తదుపరి విచారణ మే 23కి వాయిదా పడింది. ఈ తీర్పుతో ప్రస్తుతం రెహమాన్‌కు తాత్కాలిక ఊరట లభించినట్టైంది.
Recent Random Post:














