
మాజీ విశ్వసుందరి, సీనియర్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం మరియు నటన ద్వారా దేశీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈమె. తెలుగు, తమిళ్, హిందీ భాషల ప్రేక్షకులకోసం ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన ఐశ్వర్య, తన రీ-ఎంట్రీ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ కోరిక కొంత మేరకు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో సంతృప్తి చెందింది.
తాజాగా, రెడ్ సీ ఫెస్టివల్ వేదికపై ఐశ్వర్య బ్లాక్ అండ్ వైట్ అవుట్‌ఫిట్‌లో అద్భుతంగా మెరిసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంలో తన కెరియర్ గురించి మాట్లాడుతూ, ఐశ్వర్యరాయ్ ఇలా చెప్పుకొచ్చింది:
“1994లో అనుకోకుండా ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొన్నాను. కచ్చితంగా టైటిల్ రావడం నా ఆశయంకాదు. అంతర్జాతీయ పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావించాను. ఆ సమయంలో భారతీయుల గురించి ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే, మన దేశం గురించి గొప్పగా వివరించే అవకాశం నాకు దక్కడం అదృష్టం.”
మిస్ వరల్డ్ టైటిల్ గెలిచినపై స్పందిస్తూ, ఐశ్వర్యరాయ్ తెలిపింది:
“ప్రపంచ సుందరిగా టైటిల్ గెలవడం నా జీవితం పూర్తిగా మార్చి వేయింది. అలా ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఇరువర్ సినిమాలో అవకాశం వచ్చింది. అదే సంవత్సరం బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా దేవదాస్ సినిమా నా జీవితంలో మైలురాయిగా నిలిచింది. ఆ సినిమా తర్వాతే కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా నిర్ణయించాను. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నానో మీకు తెలుసు.”
అంతేకాదు, తనను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ఐశ్వర్య ధన్యవాదాలు తెలియజేసి, అభిమానులను సంతోషపరచింది. ఆమె ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recent Random Post:















