క‌త్తిపోట్లు పొడిచినా సెక్యూరిటీ అవ‌స‌రం లేద‌ట‌

Share


బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దోపిడీ ప్ర‌య‌త్నం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్ శ‌రీరంలోకి ఆరు చోట్ల క‌త్తి పోట్లు తగిలాయి. కానీ, సకాలంలో వైద్య చికిత్స అందుకుని అతడు పూర్తిగా కోలుకున్నాడు. అయితే, ఈ ఘటనపై సైఫ్ తన సెక్యూరిటీ గురించి స్పందించాడు.

అతడి మీద జరిగిన దాడికి స్పందిస్తూ, చాలా మంది ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందులో భాగంగా, సైఫ్ తన భద్రత కోసం డబ్బు చెల్లించ‌లేక‌పోతున్నాడా?, ఆతని సెక్యూరిటీ కోసం రక్షకుల‌ను ఎందుకు నియ‌మించుకోలేదు? అని ప్ర‌శ్నించారు.

సైఫ్ అలీ ఖాన్ మాత్రం అన్నీ హాస్యంగా తీసుకుని, తన భద్రతపై ఎటువంటి ఆసక్తి లేద‌ని వ్యాఖ్యానించాడు. ఢిల్లీ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ ఇలా అన్నాడు: “నేను ఎప్పుడూ భద్రతను నమ్మలేదు. నాకు ఎక్కువ భద్రత అవసరం లేదు. జ‌నం అడుగుతున్నారు, కానీ నా కోసం భద్రత అవసరం లేదు. ఆ ఘటన నా పై దాడి కాదు. అది ఒక పొరపాటే” అని చెప్పాడు.

అయితే, రొనిత్ రాయ్ భద్రతా సంస్థను సైఫ్ అలీ ఖాన్ తన రక్షణ కోసం నియమించినట్లు తెలుస్తోంది. అలాగే, ఇంటి వెలుపల సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ, సైఫ్ తనకు అవ‌స‌రం లేదని చెబుతూ, ముంబై సేఫ్‌గా ఉంటానని విశ్వసిస్తున్నట్లు చెప్పాడు.

సైఫ్ ప్రస్తుతం గాయాల నుండి పూర్తిగా కోలుకుని, తన త‌దుప‌రి చిత్రం “ది జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్” ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు.


Recent Random Post: