
మంచు విష్ణు నటుడిగా తన కెరీర్‌లో ఒక ప్రత్యేక మైలురాయిని చేరుకున్న చిత్రం కన్నప్ప. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన రోజునుంచి రిలీజ్ అయ్యే వరకూ విష్ణు ఎంతో నమ్మకంగా, పూర్తిస్థాయి ఫోకస్‌తో పనిచేశాడు. సినిమా కోసం పెట్టిన కష్టం, చూపిన నిబద్ధత చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. శివుడిపై నమ్మకం పెట్టుకుని తన ప్రయత్నాల్లో ఎలాంటి లోపం లేకుండా ముందుకు సాగిన విష్ణుకు, కన్నప్ప విజయంతో అందుకు తగిన ప్రతిఫలం లభించింది.
ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌తో పాటు ప్రచారంలో పాల్గొనడం వల్ల బజ్ విపరీతంగా పెరిగింది. ఇది కూడా విష్ణుకు శివుడిచ్చిన బహుమతిగా భావించవచ్చు. కమర్షియల్ లెక్కలేమైనా, కన్నప్ప చిత్రంలో విష్ణు నటన పరంగా తనలోని టాలెంట్‌ను మరోసారి నిరూపించుకున్నాడు.
ఇప్పుడేమో, కన్నప్పతో వచ్చిన క్రేజ్‌ను మంచు విష్ణు తన తదుపరి చిత్రాలకు ఎలా ఉపయోగించుకుంటాడో అన్నది ఆసక్తికరమైన విషయం. గతంలో విష్ణు చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం కాకపోయినా, ఈ విజయంతో ఆయనలో ఆలోచనా ధోరణి మారే అవకాశం కనిపిస్తోంది. మంచి కథ, నిబద్ధత గల దర్శకులతో పనిచేస్తే మంచు విష్ణుకు సక్సెస్ మెరుగ్గా దక్కే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం ఆడియెన్స్‌లో విష్ణుపట్ల ఒక పాజిటివ్ వైబ్ ఏర్పడింది. ఆయన సినిమాను ఆసక్తిగా ఎదురుచూడే ప్రేక్షకులు కూడా పెరిగారు. కాబట్టి, ఈ క్రేజ్‌ను నిలబెట్టుకోవడం కోసం మంచి కథలను ఎంచుకుని, స్క్రిప్ట్ విషయంలో కాస్త జాగ్రత్త పడితే మంచు విష్ణు కెరీర్ మరో మలుపు తిరుగుతుంది.
ఇప్పటికే తన నెక్స్ట్ సినిమాల కోసం కథల వేట ప్రారంభించాడనే టాక్ వినిపిస్తోంది. కన్నప్ప విజయంతో వచ్చిన ఈ ఉత్సాహాన్ని నిలబెట్టుకుంటూ మంచు విష్ణు మరిన్ని మంచి సినిమాలు ఇవ్వగలడా? అనేది ఆసక్తిగా వేచిచూడాల్సిన విషయం!
Recent Random Post:














