కమలినీ ముఖర్జీ చెప్పింది: తెలుగు సినిమా నుంచి శాశ్వత గుడ్‌బై

Share


కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల వల్ల లేదా కొన్ని సినిమాల కారణంగా కొన్ని నటులు ఇండస్ట్రీకి దూరం అవుతారు. కానీ ఈ విషయంలో ఒక హీరోయిన్ తన పాత్ర కారణంగా ఇండస్ట్రీకి దూరమైందని వెల్లడించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె పేరు కమలినీ ముఖర్జీ.

రాజా హీరోగా వచ్చిన ఆనంద్ సినిమాతో అనుకోని పాపులారిటీ పొందిన కమలినీ, గోదావరి, గమ్యం, స్టైల్, గోపి గోపిక గోదావరి వంటి చిత్రాలలో heroine గా నటించి ప్రేక్షకులను మాయం చేసింది. చివరగా రామ్ చరణ్ హీరోగా నటించిన గోవిందుడు అందరివాడేలే తర్వాత ఆమె తెలుగు ఇండస్ట్రీ నుంచి దూరమయ్యింది. ఆ తర్వాత ఇతర భాషలలో కొన్ని సినిమాలు చేసిన తర్వాత 2016లో మలయాళం మూవీ పులి మురుగన్ తర్వాత పెళ్లి చేసుకుని సినీ పరిశ్రమ నుండి విరమించిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం కుటుంబం మీద దృష్టి పెట్టి, జీవితాన్ని సాగిస్తున్న కమలినీ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన దూరం కారణాలను వివరిస్తూ ఆశ్చర్యపరిచింది. ఆమె మాట్లాడుతూ, “తెలుగులో ఎన్నో రకాల ఎమోషనల్ పాత్రలు చేసినాను. బలమైన స్త్రీ పాత్రలు కూడా చేశాను, అలాగే సున్నితమైన పాత్రల్లో కూడా కనిపించాను. అన్ని పాత్రలు చేసిన తర్వాత టాలీవుడ్ లో బలమైన క్యారెక్టర్లు రావడం తగ్గిపోయింది. గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత నా పాత్ర సరైన ప్రాధాన్యత పొందలేదు అనిపించింది. సినిమా పూర్తి అయిన తర్వాత నా పాత్ర చూసి నాకే ఇబ్బందిగా అనిపించింది. బాధపడాను, గొడవ పెట్టాలనుకోలేదు. అందుకే ఆ సినిమా తర్వాత తెలుగు సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నాను,” అని తెలిపింది.

తనకెందుకు తెలుగు సినిమాలు చేయడం ఇష్టం లేకపోయిందన్నదానిపై కమలినీ ఇలా వివరించింది, “సినిమాల్లో కొన్ని సీన్స్ డైరెక్టర్ చెప్పిన విధంగా చేస్తారు, కానీ ఎడిటింగ్‌లో అది తీసేస్తారు. కానీ నటులకు ఆ విషయం తెలియజేయరు. మన సీన్ లేదా డైలాగ్ తీసేయబడితే ఎంత బాధతో ఉంటామో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. దీన్ని నేను సులభంగా ఎదుర్కోలేకపోయాను. అందుకే తెలుగు సినిమాల నుంచి దూరమై, ఇతర భాషల్లో సినిమాలు చేయడం ప్రారంభించాను.”

మొత్తం చెప్పాలంటే, తెలుగు ఇండస్ట్రీలో తాను బలమైన క్యారెక్టర్లు అందుకోలేదని, అందుకే ఆమె నటించడం ఇష్టపడక, దూరమై శాశ్వతంగా గుడ్ బై చెప్పినట్టు చెప్పింది కమలినీ ముఖర్జీ.


Recent Random Post: