బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తన ఫస్ట్ ఓటీటీ మూవీ జానే జాన్. సునయ్ ఘోష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జపాన్ నావెల్ డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ స్పూర్తితో తెరకెక్కింది. ఈ సినిమాలో జైదీప్ అహ్లావత్, కరీనా కపూర్, విజయ్ వర్మ నటించారు. అయితే ఆల్రెడీ మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఆ జపాన్ మూవీ డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ తోనే దృశ్యం సినిమా చేశాడు. దృశ్యం 1 మాత్రమే కాదు దృశ్యం 2 ని కూడా ఆయన తెరకెక్కించారు.
మోహన్ లాల్ లీడ్ రోల్ లో దృశ్యం 1, 2 సినిమాలు సౌత్ ఆడియన్స్ ని మాత్రమే కాదు హిందీ ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఇప్పుడు ఆ సినిమాలు స్పూర్తిగా పొందిన చేసిన జానే జాన్ సినిమాను చూసి ప్రేక్షకులు దృశ్యం ని రిలేట్ చేసుకునే అవకాశం ఉంది. జానే జాన్ సినిమా కథ అదే అయినా ఇందులో దర్శకుడు కొన్ని మార్పులతో కొత్తగా సెటప్ చేశాడు.
జానే జాన్ సినిమా క్రైం మిస్టరీని త్వరగానే రివీల్ చేసి ఆడియన్స్ ని మొదటి నుంచి సినిమాకు ఎంగేజ్ అయ్యేలా చేస్తుంది. అయితే డ్రామా ఎక్కువవడం వల్ల కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. జైదీప్ తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. అతని పాత్ర సినిమాకు బలం అనిపిస్తుంది. కరీనా కపూర్ కూడా తన నటనతో మెప్పించింది. విజయ్ పోలీస్ పాత్రలో పర్వాలేదు అనిపించాడు.
సినిమాలో లోపాలను పక్కన పెడితే జానే జాన్ ఓకే అనేలా ఉంది. నరేషన్ స్లో అవడం వల్ల ట్విస్ట్ లో పెద్దగా ఇంప్యాక్ట్ కలిగించదు. సినిమా చూస్తున్నంత సేపు దృశ్యం సినిమా గుర్తుకొస్తుంది. అయితే కొత్త పాత్రలు కొత్త తారలు సినిమాలు మరో థ్రిల్ కలిగిస్తాయి. ఓటీటీ ఆడియన్స్ కు ఈ వీకెండ్ కు జానే జాన్ మంచి ఎంటర్టైనింగ్ అందిస్తుందని చెప్పొచ్చు. దృశ్యం తరహా సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. మన దగ్గర కన్నా ఓటీటీ సినిమాలను బాలీవుడ్ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు. కాబట్టి జానే జాన్ సినిమాకు ఈ పాజిటివ్ టాక్ మూవీని ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు. కరీనా కపూర్ మొదటి ఓటీటీ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఆమె ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అందిస్తుంది.
Recent Random Post: