కల్కి 2 కోసం వేచి చూస్తున్న ప్రపంచం!

Share


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన “కల్కి 2898 ఏ.డి” మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం, వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో రూపొందించి ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లింది.

గత ఏడాది విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద రెచ్చిపోయింది. వరల్డ్‌వైడ్‌గా 1000 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేసి ఒక రికార్డు సృష్టించింది. నాగ్ అశ్విన్ మేకింగ్, విజువల్స్, కథనం అన్నింటితో ఆడియన్స్‌ను విభిన్న అనుభూతికి లోనయ్యేలా చేశారు.

ఇప్పుడు అందరి ఫోకస్ “కల్కి సీక్వెల్”పై. తాజాగా నాగ్ అశ్విన్ సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, 2026 చివరలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని తెలిపారు. ఈసారి ప్రభాస్ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండబోతుందనీ, ఎక్కువ స్క్రీన్ టైం దక్కుతుందని చెప్పారు.

ఇదిలా ఉండగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్‌గా నటించి ప్రేక్షకులను అలరించగా, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్‌లు గెస్ట్ రోల్స్‌లో మెరిశారు. వారి క్యామియోలు సినిమాకే స్పెషల్ హైలైట్ అయ్యాయి.

ఇక సీక్వెల్ ఎప్పుడు వస్తుందన్నదానిపై తాజాగా నాగ్ అశ్విన్ సరదాగా స్పందించారు. “కల్కిని 3-4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు రిలీజ్ చేశాం… సీక్వెల్‌ను 7-8 గ్రహాలు వరుసగా ఉన్నప్పుడు రిలీజ్ చేస్తా!” అని ఫన్నీగా చెప్పారు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఎట్టకేలకు, “కల్కి 2″పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఈసారి నాగ్ అశ్విన్ ఎలాంటి విజువల్ వండర్ అందించబోతున్నారో చూడాలి.


Recent Random Post: