
ప్రముఖ చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కల్యాణి ప్రియదర్శన్ అక్కడి ఆడియన్స్‌కి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. హలో తర్వాత వచ్చిన చిత్రలహరి, రణరంగం వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నా, ఆశించినంత బిజీ కాకపోవడంతో అమ్మడు కోలీవుడ్ వైపు అడుగులు వేసింది. కానీ అక్కడ కూడా రెండు–మూడు సినిమాల తర్వాత అంతగా సెటిల్ కాకపోవడంతో ఆమె మల్లి మోలీవుడ్‌కి మళ్లింది. అయితే ఆ నిర్ణయం మాత్రం కల్యాణీ కెరీర్‌ని మరో లెవల్‌కు తీసుకెళ్లింది.
గత కొన్నేళ్లుగా మోలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కల్యాణి, తాజాగా విడుదలైన లోక చాప్టర్ వన్ చంద్రతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఆమె కెరీర్లోనే కాదు, మోలీవుడ్‌లోనూ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సౌత్ అంతటా కల్యాణి పేరు మారుమోగేలా చేసింది. ఫీమెల్ సెంట్రిక్ సస్పెన్స్ థ్రిల్లర్ కావడం, కల్యాణి శక్తివంతమైన నటన ఈ సినిమాను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి.
ఈ విజయంతో మళ్ళీ కోలీవుడ్‌లో కూడా కల్యాణికి క్రేజ్ పెరిగింది. ఇప్పటికే జెన్నీ సినిమాలో నటిస్తోన్న ఆమె, తాజాగా కార్తీ హీరోగా నటిస్తున్న మార్షల్ చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. చాలామంది నటీమణులను పరిశీలించిన తర్వాత చివరికి కల్యాణినే ఫైనల్ చేశారు. ఆలస్యంగా జరిగిన ఈ ఎంపిక మేకర్స్‌కు అదృష్టమైందనే చెప్పాలి, మార్కెట్ పరంగా కూడా ఇది బెస్ట్ చాయిస్‌గా కనిపిస్తోంది.
కార్తీ నటిస్తున్న ఈ 29వ చిత్రాన్ని తమిళ అనే దర్శకుడు రూపొందిస్తున్నారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ప్రొడక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా. ఇప్పటివరకు కార్తీ ఈ జానర్లో సినిమా చేయకపోవడం వల్ల ఆయన కూడా ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాడు. పాత్రకు తగ్గట్టు ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ కొత్త లుక్‌తో కనిపించనున్నాడు.
ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచన కూడా మేకర్స్ చేస్తున్నారని సమాచారం. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే, కార్తీ నటించిన వా వాతయార్ ఈ డిసెంబర్లో విడుదల కానుండగా, సర్దార్ 2 కూడా వచ్చే ఏడాది ప్రారంభంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Recent Random Post:















