కాంత మూవీ నుండి భాగ్యశ్రీ లుక్ విడుద‌ల

Share


దుల్కర్ సల్మాన్ హీరోగా, సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాంత’ ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ప్రేక్షకుల మనసు దోచేసింది. 1950 నాటి స్టైల్ లో దుల్కర్ అందంగా, వైవిధ్యంగా కనిపించిన ఆ ఫస్ట్ లుక్‌కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. అప్పటి నుంచే ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది.

ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకుల్లో హైప్‌ను పెంచేందుకు చిత్రబృందం తరచూ కాంత సినిమాకు సంబంధించిన అప్డేట్లు విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని కొనసాగిస్తోంది.

ఇప్పుడిలా, తాజాగా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే లుక్‌ను విడుదల చేశారు. ఇది ఆమె పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ బర్త్‌డే విషెస్ గా మేకర్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. 1950ల నాటి తెలుగు అమ్మాయి గెటప్‌లో భాగ్యశ్రీ చీరకట్టు, గాజులు, బొట్టు లాంటి సంప్రదాయ హంగులతో అద్భుతంగా మెరిసింది. ఈ లుక్‌కి నెటిజన్లు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న కాంత చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రతి అప్డేట్‌తో సినిమాపై బజ్ మరింతగా పెరుగుతోంది.


Recent Random Post: