
బాలీవుడ్‌లో మరో పాపులర్ రొమాంటిక్ కామెడీకి సీక్వెల్ రానుంది. 2012లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన **‘కాక్‌టెయిల్’**కు ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, మొదటి భాగంలోని తారాగణం పూర్తిగా మారనుంది. సైఫ్ అలీఖాన్ స్థానంలో ఈసారి షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటించనున్నాడని తెలుస్తోంది.
కథానాయికలుగా కృతి సనన్, రష్మిక మందన్న ఎంపిక అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా 2025 ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. విడుదలైతే 2025 చివర్లో పెద్ద తెరపై కనిపించే అవకాశం ఉంది.
చిత్రీకరణను భారతదేశంతో పాటు యూరప్‌లోని అందమైన లొకేషన్లలో ప్లాన్ చేస్తున్నారని, టిమ్ అంతా దీనికి చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తోందని బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఈ సీక్వెల్‌కు మళ్లీ హోమి అదాజానియా దర్శకత్వం వహించనున్నాడు. కానీ ఈసారి స్క్రిప్ట్ వర్క్‌లో లవ్ రంజన్ చురుగ్గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే షాహిద్, విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కే **’అర్జున్ ఉస్తారా’**లో నటిస్తుండగా, కృతి సనన్, ధనుష్ సరసన ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో బిజీగా ఉంది. రష్మిక మందన్న మాత్రం ‘కాక్‌టెయిల్ 2’లో ఎంట్రీ ఇవ్వకముందు, ఆయుష్మాన్ ఖురానాతో చేస్తున్న ‘థమా’ షూట్‌ను పూర్తి చేయనుంది.
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌పై ఇప్పటికే బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
Recent Random Post:















