కార్తీక్ ఆర్యన్ స్టార్‌డమ్‌ నిలబెట్టుకునే పోరాటం

Share


బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ వరుస విజయాలతో స్టార్‌డమ్ అందుకున్నాడు. ముఖ్యంగా గత ఏడాది విడుదలైన ‘చందు ఛాంపియన్’, ‘భూల్ భులయ్యా 3’ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఆయన కెరీర్ మరో స్థాయికి చేరుకుంది. ఆకట్టుకునే నటనతో పాటు బలమైన పీఆర్ టీమ్ ఉండటం వల్ల ఎప్పుడూ మీడియా దృష్టిలో ఉంటూ కొత్త ఆఫర్లను దక్కించుకుంటున్నాడనే టాక్ ఉంది. బాలీవుడ్ హీరోల్లో పీఆర్‌ను అత్యంత వినియోగించుకునే నటుడు కార్తీక్ ఆర్యన్ అని సోషల్ మీడియాలో కూడా బహిరంగంగానే చర్చ జరుగుతోంది.

అయితే వరుస విజయాలతో వచ్చిన స్టార్‌డమ్‌ను కాపాడుకోవడం అంత తేలిక కాదు. ఇప్పుడు అదే సవాల్‌ను కార్తీక్ ఎదుర్కొంటున్నాడని బాలీవుడ్ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన అనురాగ్ బసు దర్శకత్వంలో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. మొదట ఈ సినిమా ‘ఆషికీ’ ఫ్రాంచైజీలో భాగమని అనుకున్నారు. కానీ తర్వాత ఈ సినిమాకు ఆ ఫ్రాంచైజీతో సంబంధం లేదని, కొత్త టైటిల్‌తో రాబోతుందని స్పష్టంచేశారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలని కార్తీక్ చాలా పట్టుదలగా ఉన్నాడు. ఇప్పటివరకు సినిమా పబ్లిసిటీ బాగా జరగడంతో ఆసక్తి పెరిగింది.

ఇక బాలీవుడ్ అంతా ‘సయ్యారా’ సినిమాపైనే దృష్టి పెట్టింది. అసలైన ఆషికీ మూడ్‌ను ఈ సినిమా అందుకుందని కొందరు అంటున్నారు. రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సయ్యారా త్వరలోనే 500 కోట్ల మార్క్ దాటుతుందని బాక్సాఫీస్ వర్గాల అంచనా. ఇలాంటి సమయంలో కార్తీక్ ఆర్యన్ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకర్షిస్తుందో అనుమానం వ్యక్తమవుతోంది. మరీ సయ్యారాతో పోలికలు తప్పవని కూడా చాలామంది భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతం కార్తీక్ పీఆర్ టీమ్‌తో స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కార్తీక్ ఆర్యన్ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. 2011లో ‘ప్యార్ కా పంచ్‌నామా’ సినిమాలో చిన్న పాత్రతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో అతని నటన బాగానే ఆకట్టుకున్నా స్టార్‌డమ్ మాత్రం వెంటనే దక్కలేదు. చేసిన చిత్రాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. చిన్న సినిమాలతోనే కొనసాగాల్సి వచ్చింది.

2022లో ‘భూల్ భులయ్యా 2’ భారీ విజయాన్ని సాధించడంతో కార్తీక్ కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత పెద్ద సినిమాలు చేస్తూ వరుస విజయాలతో ఇండస్ట్రీలో తన స్థానం బలపరచుకున్నాడు. ఇప్పుడు ఈ ఫామ్‌ను కొనసాగించగలడా అన్నది చూడాలి.


Recent Random Post: