కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్.. కంటెంటే అల్టిమేట్!

కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి నిరూపితం అయింది దాదాపుగా పదేళ్ల నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న కింగ్ షారుఖ్ ఖాన్ అభిమానులకు పఠాన్ రూపంలో ఒక బంపర్ బొనాంజా తగిలింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా తెరకెక్కిన పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే.

జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సహా హిందీ తమిళ భాషల్లో విడుదలవగా ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగిందని అంటున్నారు.

దీంతో చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న బాలీవుడ్ కి సైతం ఒక బంపర్ హిట్ దొరికినట్లుగా అందరూ భావిస్తున్నారు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ ఒక రా ఏజెంట్ పాత్రలో కనిపించాడని అంటున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమాని బాయ్ కాట్ చేయాలని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున హిందూ సంఘాల నుంచి అనేక నిరసనలు వెల్లువెత్తాయి. సినిమా బ్యాన్ అవుతుంది అంటూ కూడా ప్రచారాలు జరిగాయి.

అయితే సినిమా విడుదలైన తర్వాత సినిమా ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చడంతో అందరూ సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ దెబ్బతో సినిమా కంటెంట్ ఉంటే ఎన్ని బాయ్ కాట్ ఉద్యమాలు జరిగినా ఎలాంటి ఉపయోగం లేదనే విషయం నిరూపితమైందని అంటున్నారు విశ్లేషకులు.

మొత్తం మీద బాలీవుడ్ కూడా చాలా కాలం నుండి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోంది. సౌత్ సినిమా బాలీవుడ్ డామినేట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఒక హిట్టు అందుకోవడం అనేది ఇప్పుడు బాలీవుడ్ వర్గాలకు కాస్త ఊపిరి సలుపుకునేలా చేసిందని చెప్పచ్చు.

మొత్తం మీద బాలీవుడ్ వారంతా ఇప్పుడు కింగ్ ఖాన్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ కూడా భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో వసూళ్లు భారీ ఎత్తున నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Recent Random Post: