కీర్తి సురేష్ వరుస ప్లాప్‌లపై కొత్త వివాదం

Share


దసరా తర్వాత కీర్తి సురേഷ്‌కు విజయాలు దూరమయ్యాయి. ఆ సినిమా తర్వాత ఆమె నటించిన ఏడు చిత్రాల్లో, మామన్నన్, కల్కి తప్ప మిగతావన్నీ ప్లాప్‌లుగానే మిగిలిపోయాయి. భోళాశంకర్, సిరెన్, రఘుతాత, బేబీ జాన్, ఉప్పుకప్పు రంబు తరువాత తాజాగా విడుదలైన రివాల్వర్ రీటా కూడా అదే జాబితాలో చేరిపోయింది. ఈ సినిమాపై కీర్తి చాలా నమ్మకంగా ఉన్నప్పటికీ, ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు. క్రైమ్ కామెడీగా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

సినిమా రొటీన్‌గా ఉందన్న విమర్శల మధ్య, తాను కామెడీ కోసం ఎంతో కష్టపడ్డానని కీర్తి వెల్లడించింది. కామెడీ చేయడం అసలు ఆషామాషీ పని కాదని, అది ఒక కఠినమైన భావోద్వేగం అని చెప్పింది. సినిమాలో ఆమె పోషించిన పాత్ర తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలా లైట్‌గా ఉండే సినిమాలు తనకు రిలీఫ్ ఇస్తాయని తెలిపింది. ఇది డైలాగులు నేర్చుకుని రిహార్సల్స్ చేసి చేయాల్సిన రోల్ కాదని, సహజంగా పండించాల్సిన కామెడీ అని వివరించింది.

అయితే, ఈ వ్యాఖ్యలు నెటిజన్లను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. “ప్లాప్ సినిమా గురించి ఇంత పాజిటివ్‌గా ఎందుకు మాట్లాడుతోంది?” అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. వరుస విఫలాల నేపథ్యంలో కీర్తి సురేష్ స్వయంగా తనను తాను సమర్థించుకునే ప్రయత్నమా? అని కూడా కామెంట్లు చేస్తున్నారు. రివాల్వర్ రీటా రివ్యూలు గుర్తు చేస్తూ, ఇకపై లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం తగ్గిస్తే మంచిదని కొందరు సలహా ఇస్తున్నారు.

మహానటి విడుదలయ్యే వరకు కీర్తి సురేష్‌కు వచ్చిన గౌరవం, అభిమానుల ప్రేమను మరచిపోలేము. వెండితెరపై నిజంగా సావిత్రినే చూస్తున్నట్లుగా ఉందని, పాతతరం అభిమానులు ఆమెపై ప్రశంసల మేళం కురిపించారు. అప్పట్లో కీర్తిని కలసి మాట్లాడేందుకు అభిమానులు క్యూ కట్టేవారు. కానీ నేడు, అదే అభిమానుల దగ్గర నుంచి ఆమెకు నెగటివిటీ ఎదురవడం బాధాకరం.

ప్రస్తుతం కీర్తి తమిళంలో కన్నైవేడి అనే చిత్రంలో నటిస్తోంది. ఆమె చేతిలో ఇప్పుడు ఉన్న ఏకైక ప్రాజెక్ట్ అదే. బాలీవుడ్‌లో బేబీజాన్తో లాంచ్ అయిన తర్వాత మరో అవకాశం వచ్చిందన్న ప్రచారం వినిపించినా, ఆపై ఎలాంటి అధికారిక అప్‌డేట్ లేదు.


Recent Random Post: