కీర్తి సురేష్ – సూర్య జంటగా ‘796 సీసీ’ లో కొత్త ప్రయాణం!

Share


‘మహానటి’ సినిమాతో ప్రేక్షకుల మనసు గెలిచిన కీర్తి సురేష్‌ ఇటీవలి కాలంలో ఎక్కువగా తమిళం, హిందీ ప్రాజెక్టులపైనే దృష్టి సారించింది. ‘బేబీ జాన్‌’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి, ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా అక్కడి నుండి కొన్ని మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం ఓ హిందీ వెబ్‌ సిరీస్‌తో పాటు రెండు హిందీ సినిమాల చర్చల్లో ఉన్నట్లు సమాచారం.

ఇక తమిళంలోనూ కీర్తి బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆమె కొంతకాలంగా కనిపించకపోవడంతో అసంతృప్తి నెలకొంది. ఇప్పుడు ఆ గ్యాప్‌కి ఎండ్ చెప్పేలా కనిపిస్తోంది. ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే బహుభాషా చిత్రంలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం.

వెంకీ అట్లూరి గతేడాది తీసిన ‘లక్కీ భాస్కర్’ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆర్థిక నేరాల నేపథ్యంలో జరిగిన కథతో ప్రేక్షకుల మెప్పు పొందిన ఆ సినిమా హిందీ సహా అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఇప్పుడు ఆయన సూర్యను హీరోగా పెట్టి ఓ భారీ బడ్జెట్‌ సినిమాను రూపొందించబోతున్నారు.

వెంకీ అట్లూరి గతేడాది తీసిన ‘లక్కీ భాస్కర్’ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆర్థిక నేరాల నేపథ్యంలో జరిగిన కథతో ప్రేక్షకుల మెప్పు పొందిన ఆ సినిమా హిందీ సహా అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఇప్పుడు ఆయన సూర్యను హీరోగా పెట్టి ఓ భారీ బడ్జెట్‌ సినిమాను రూపొందించబోతున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం “796 సీసీ” అనే టైటిల్‌తో రూపొందనుందని సమాచారం. ఇది మారుతి కార్లకు సంబంధించిన ఆసక్తికరమైన నేపథ్యం ఉన్న కథగా తెలుస్తోంది. ఇది పూర్తి బయోపిక్ కాకపోయినా, వాస్తవ ఘటనల ఆధారంగా ఫిక్షనల్‌ ప్రეზెంటేషన్‌గా ఉండబోతోంది.

ఈ సినిమాలో సూర్యకు జోడీగా కీర్తి సురేష్‌ ఎంపిక కావడం మరో హైలైట్‌. గతంలో వీరిద్దరూ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ‘రంగ్‌ దే’లో కలిసి పనిచేశారు. ఆ సినిమా కమర్షియల్‌గా అంతగా రాణించకపోయినా, మళ్లీ ఇదే కాంబోను ట్రై చేయడంపై ఆసక్తి నెలకొంది. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ చిత్రంపై అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

ఈ సినిమా సూర్యకి తొలిసారి డైరెక్ట్‌ తెలుగు సినిమా కావడంతో పాటు, తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందనున్న భారీ ప్రాజెక్ట్‌ కావడం విశేషం.


Recent Random Post: