
అయితే ఆమెకు నిజమైన గుర్తింపు మాత్రం ఉప్పెన సినిమా తర్వాతే వచ్చింది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడంతో ఆమెకి భారీ క్రేజ్ వచ్చింది. దాంతో పాటు వరుసగా క్రేజీ ఆఫర్లు కూడా రావడం ప్రారంభమైంది. ఒక కథానాయకిగా తొలి సినిమా హిట్ కావడం ఎప్పుడూ స్పెషల్. కానీ ఆ ఫ్లోను కొనసాగించాలంటే, తదుపరి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలి.
అయితే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాల్లో పరవాలేదనిపించినా, తర్వాత కృతి చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది. గతేడాది శర్వానంద్‌తో నటించిన మనమే సినిమాతోనూ ఆమెను పెద్దగా గుర్తించలేదు ప్రేక్షకులు. సినిమాల పరంగా ఫలితాలు బాగోలేకపోవడంతో పాటు, నటిగా కూడా మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయిన కారణంగా, కృతి శెట్టిపై ప్రేక్షకుల ఆసక్తి తగ్గింది. అదే కారణంగా దర్శకనిర్మాతలు కూడా ఆమెను పట్టించుకోవడం తగ్గించారు.
తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో, ఇప్పుడు ఆమె దృష్టిని తమిళ సినీ పరిశ్రమ వైపు మళ్లించింది. ప్రస్తుతం ఆమె L.I.K మరియు జినీ అనే తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపైనా ఆమె మంచి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, సినిమాల పరంగా ఛాన్స్‌లు తగ్గినప్పటికీ, సోషల్ మీడియాలో ఫొటోషూట్లతో మాత్రం కృతి శెట్టి ఫుల్ యాక్టివ్‌గా ఉంది. తొలి రోజుల్లో గ్లామర్ షో విషయంలో హౌరా పాడిన ఆమె, ఇప్పుడు మాత్రం ధైర్యంగా గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రాక్షన్ సంపాదిస్తోంది. అయితే ఈ గ్లామర్ ట్రాన్స్‌ఫర్మేషన్ వల్ల ఆమెకు కొత్త అవకాశాలు వస్తాయా లేదా అన్నది సమయం చెప్పాలి.
ప్రస్తుతం కోలీవుడ్‌లో తన అవకాశాలపై ఆశలు పెట్టుకున్న కృతి శెట్టి, టాలీవుడ్‌కి తిరిగి ఎప్పుడు గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుందో చూడాల్సిందే.
Recent Random Post:















