కృతి సనన్‌ బర్త్‌డే వెకేషన్ ఫోటోలు వైరల్

Share


దశాబ్దం క్రితం 1 నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన కృతి సనన్, ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా మహేష్ బాబు, సుకుమార్‌లకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే కృతి మాత్రం పెద్దగా గుర్తింపు పొందలేదు. అదే సమయంలో ఆమె హిందీలో చేసిన హీరో పంతీ సినిమా మంచి హిట్ అవ్వడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేస్తూ, దోచేయ్ ద్వారా నాగ చైతన్యతో మరోసారి తెలుగులో కనిపించింది. కానీ రెండు తెలుగు సినిమాలు నిరాశపరిచిన తర్వాత మళ్లీ టాలీవుడ్‌ వైపు తిరిగి చూడకుండా బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా నిలిచింది.

సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆమె ఆదిపురుష్ సినిమాతో తిరిగి తెలుగువారిని కలిసింది. సీత పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంది. గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కృతి ఈ ఏడాది ఇంకా ఏ సినిమా రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తేరే ఇష్క్ మే సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఇందులో పూర్తిగా కొత్త షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట. ఇంకా కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

జులై 27న తన పుట్టినరోజు సందర్భంగా కృతి సముద్రం మధ్యలో సన్నిహితులతో కలిసి బర్త్‌డే వెకేషన్‌ను ఎంజాయ్ చేసింది. ఆ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరోసారి ట్రెండ్ అయ్యింది. ప్రైవేట్ బోట్‌లో అందంగా కనిపించిన కృతి బర్త్‌డే వెకేషన్ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అందంగా పిక్‌లకు పోజులు ఇవ్వడం, స్పీడ్ బోట్‌లో సాహసం చేయడం మాత్రమే కాకుండా, బోట్‌లో కూడా వర్కౌట్స్ చేసిన వీడియోను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. వర్కౌట్ మానలేదా? అంటూ కొందరు కామెంట్లు చేస్తే, నీ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ అంటున్నారు మరికొందరు.

జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసుకున్న కృతి, మొదట ఫ్యాషన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. బరేలీ కి బర్ఫీ, లుకా చుప్పీ వంటి సినిమాలు ఆమె కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యాయి. దిల్‌వాలే, హౌస్‌ఫుల్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించింది. ముఖ్యంగా 2021లో వచ్చిన మిమి సినిమా ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. సరోగేట్ మదర్ పాత్రలో నటిస్తూ తన నటన ప్రతిభను నిరూపించుకుంది.

ఏ పాత్రకైనా సవాలు విసరడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పే కృతి, గ్లామర్‌తో పాటు నటనలోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.


Recent Random Post: