కేతిక శర్మ సోషల్ మీడియా బ్రేక్‌తో షాక్

Share


సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రతి చిన్న విషయాన్నీ అభిమానులతో పంచుకుంటూ యాక్టివ్‌గా ఉంటున్నారు సినీ ప్రముఖులు. అయితే, అప్పుడప్పుడు సడన్‌గా సోషల్ మీడియా బ్రేక్ తీసుకుంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి అలాంటి బ్రేక్ తీసుకుని, కొద్ది రోజులకే మళ్లీ కం బ్యాక్ ఇచ్చి అభిమానులను ఎంటర్‌టైన్ చేయడం మొదలుపెట్టింది. ఇక ఇప్పుడు అదే బాటలో మరో హీరోయిన్ సోషల్ మీడియాకి దూరం కాబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆమె మరెవరో కాదు కేతిక శర్మ.

హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కేతిక, స్పెషల్ సాంగ్స్‌లోనూ తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటూ గ్లామర్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరించే ఈమె తాజాగా “కొంతకాలం బ్రేక్ తీసుకుంటున్నాను” అంటూ ప్రకటించింది. అంతేకాకుండా చాట్ జిపిటితో డిజైన్ చేయించిన ఓ ఫోటోను షేర్ చేస్తూ “సోషల్ మీడియా బ్రేక్.. విల్ బి బ్యాక్ సూన్” అనే క్యాప్షన్ జోడించింది. దీంతో అభిమానులు మొదట షాక్‌కు గురైనా, త్వరలోనే తిరిగి వస్తానని ఇచ్చిన హింట్‌తో కొంత రిలాక్స్ అయ్యారు. కానీ, అసలు ఈ బ్రేక్ వెనక కారణం ఏమిటో చెప్పేవరకు అభిమానుల కుతూహలం అలాగే కొనసాగుతుంది.

కేతిక శర్మ కెరీర్‌పై ఒకసారి దృష్టి సారిస్తే – 1995 డిసెంబర్ 24న ఢిల్లీలో జన్మించిన ఆమె, లక్నోలోని మార్టినీర్స్ స్కూల్‌లో చదివి, ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసుకుంది. చదువు పూర్తవగానే మోడలింగ్, డబ్‌స్మాష్ వీడియోలు, యూట్యూబ్ కంటెంట్‌తో ముందే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత 2021లో ‘రొమాంటిక్’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఇకపోతే లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో వంటి సినిమాలలో నటించిన ఆమె, అల్లు అర్జున్‌తో కలిసి ఓటిటి ప్రోమోలో కూడా కనిపించింది. అంతేకాకుండా రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ “అది దా సర్ప్రైజ్”లో స్టెప్పులేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టిన కేతిక, తాత్కాలికంగా సోషల్ మీడియాకి గుడ్‌బై చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


Recent Random Post: