
‘సామజవరగమన’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న భాను-నందు ద్వయం, రచయితలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు, భాను భోగవరపు రవితేజ ‘మాస్ జాతర’ సినిమాతో దర్శకుడిగా అడుగుపెడుతుండగా, నందు కూడా తన దర్శకత్వ ప్రయాణాన్ని మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం, నందు చెప్పిన ఓ వినోదభరిత ప్రేమకథ ప్రాజెక్ట్ ఓ ప్రముఖ హీరోకు నచ్చడంతో, స్క్రిప్ట్‌ను మరింత డెవలప్ చేయమని సూచించారట. కథ పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉంటే, ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారని టాక్. ఇక కథానాయికగా కృతి శెట్టి పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది.
అఖిల్: కొత్త వేగంతో ముందుకు!
ప్రస్తుతం అఖిల్, ‘లెనిన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రస్టిక్ విలేజ్ డ్రామాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తయ్యాక, UV క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ ఓ ఫాంటసీ చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ రకరకాల కారణాల వల్ల ఇది వాయిదా పడుతుండటంతో, ఈ గ్యాప్‌లో నందు ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది.
‘ఏజెంట్’ చిత్రం పరాజయంతో కాస్త వెనుకబడిన అఖిల్, ఇకపై ప్రాజెక్ట్స్‌ను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. నాగచైతన్య ‘తండేల్’ విజయంతో మళ్లీ ఫామ్‌లోకి రావడంతో, ఇప్పుడు అఖిల్ కూడా అదే దిశగా దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్నాడు. ‘లెనిన్’ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీపావళి విడుదలకు అనుకూలంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, విడుదల తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Recent Random Post:















