కొత్త పాఠాలు నేర్పుతున్న చిన్న సినిమా!

ఇటీవల విడుదలైన ఓ చిన్న సినిమా పబ్లిసిటీ పరంగా సినిమాని ప్రేక్షకుల వద్దకు విజయవంతంగా తీసుకెళ్లే పరంగా మేకర్స్ కి కొత్త పాఠాలు నేర్పుతోంది. చిన్న సినిమాని ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలో చిన్న పాటి ట్రిక్స్ కు శ్రీకారం చుడుతూ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. షార్ట్ ఫిలింస్ తో పాపులర్ అయిన సుహాస్ `కలర్ ఫోటో`తో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

తను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `రైటర్ పద్మభూషణ్`. షణ్ముఖ్ ప్రశాంత్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ అనురాగ్ రెడ్డి శరత్ చంద్ర చంద్రూ మనోహరన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. డిఫరెంట్ పబ్లిసిటీ స్ట్రాటజీ నేపథ్యంలో ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర బృదం ఈ మూవీని ఫిబ్రవరి 3న విడుదల చేసింది. రిలీజ్కి ముందు ఆరు కీలక నగరాల్లో ప్రీమియర్ షోలని ఏర్పాటు చేసి సక్సెస్ అయింది.

పబ్లిక్ నుంచి మంచి టాక్ రావడంతో ఫిబ్రవరి 3న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అనుకున్న విధంగా సినిమాకు ప్రేక్షకుల నుంచి అనూహ్య సంపందన రావడంతో బుధవారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 38 థియేటర్లలో మహిళల కోసం ప్రత్యేకంగా ఫ్రీ షోలని ప్రదర్శించింది. ఇందు కోసం ప్రతీ ఫ్యామిలీ మెంబర్ థియేటర్లకు ఆహ్వానించి ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసింది. ఒక్క రోజు ఉమెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 8న ప్రత్యేకంగా మహిళల కోసం ఈ సినిమాని 38 థియేటర్లలో ఫ్రీగా ప్రదర్శించారు.

దీనికి మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 38 థియేటర్లలో బుధవారం 33 136 మంది మహిళలు ఈ మూవీని వీక్షించడం విశేషం. మేకర్స్ తెలివిగా వేసిన ఈ ఎత్తుగడ పద్మభూషణ్ మూవీకి బాగా కలిసొచ్చింది. అంతే కాకుండా మధ్య తరగతి ఫ్యామిలీస్ థియేటర్లకు వచ్చేలా చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మరింత బూస్ట్ ని అందించి ఫ్రీ పబ్లిసిటీని అందించడం విశేషం. ఈ నిర్మాతల స్ట్రాటజీకి సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం మెస్మరైజ్ కావడమే కాకుండా ఇటీవల చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి అభినందించడం విశేషం.


Recent Random Post: