కొత్త లుక్‌తో మెస్మరైజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

Share


టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆస్కార్ వేడుకల సందర్భంగా రెడ్ కార్పెట్‌పై నడిచి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా జపాన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటీవల దేవర సినిమాను అక్కడ విడుదల చేసి మంచి స్పందన దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఇక దక్షిణాదిలోనే కాదు, గత ఏడాది బాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన వార్ 2 చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. విలన్ పాత్రలో కనిపించినప్పటికీ, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆయనకు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నారు అన్న ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకీ పెరుగుతోంది. అప్పుడప్పుడు బయటకు వస్తున్న ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవర సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్, ఈ సినిమా కోసం గణనీయంగా బరువు తగ్గి మరింత సన్నగా, షార్ప్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇటీవల తన బావమరిది, హీరో నార్నే నితిన్ వివాహ వేడుకల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే ఓ ప్రముఖ జువెలరీ బ్రాండ్ ప్రమోషన్‌లోనూ ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంది.

ఇక తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా మరోసారి తన కొత్త లుక్‌తో అభిమానులను మెస్మరైజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాల కంట పడ్డ ఆయన, ఊర మాస్ గెటప్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఈ కొత్త మేకోవర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన తదుపరి చిత్రం కోసమేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి ఎన్టీఆర్ కొత్త గెటప్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. “సంక్రాంతికి అసలైన లుక్ బయటకు వచ్చింది” అంటూ అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.


Recent Random Post: