
పాండిచ్చేరిలో చోటుచేసుకున్న క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి నటీమణులు తమన్నా, కాజల్ అగర్వాల్ విచారణకు హాజరుకావాల్సిన అవసరం ఉందని పాండిచ్చేరి పోలీసులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపుతూ, పాండిచ్చేరికి చెందిన పది మంది నుంచి సుమారు రూ. 2.40 కోట్లు వసూలు చేసి మోసం జరిగినట్లు అశోకన్ అనే విశ్రాంతి ఉద్యోగి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం కోయంబత్తూరును ప్రధాన కేంద్రంగా ప్రారంభమైంది.
ఈ క్రిప్టో సంస్థ ప్రారంభోత్సవంలో తమన్నా, ఇతర ప్రముఖులు పాల్గొనగా, మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. అనంతరం ముంబైలో ఓ భారీ పార్టీ నిర్వహించి వేలాది మంది నుంచి పెట్టుబడులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్‌లను కూడా విచారించాలని పోలీసులు నిర్ణయించగా, వారికీ నోటీసులు జారీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రచారాన్ని తమన్నా ఖండిస్తూ తాను ఎలాంటి సంబంధం లేనని స్పష్టం చేసింది.
“క్రిప్టో కరెన్సీ కేసులో నన్ను లింక్ చేస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఇవన్నీ పూర్తిగా తప్పుడు ప్రచారం. దయచేసి ఇలాంటి అసత్య కథనాలను నమ్మవద్దు. అలాగే మీడియా సంస్థలు బాధ్యతగా వ్యవహరించి, నిరాధార వార్తలను ప్రసారం చేయకూడదు.” అని తమన్నా ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉండగా, కాజల్ అగర్వాల్ ఈ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. ఇకపోతే, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
Recent Random Post:















