గోల్ మాల్ 5 వస్తోంది… మళ్లీ నవ్వుల పండుగ!

Share


బాలీవుడ్‌లో హ్యూమర్‌కు ఓ కొత్త మలుపు ఇచ్చిన ప్రాంచైజీ అంటే అది ‘గోల్ మాల్’ సిరీస్‌నే చెప్పాలి. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో, రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ ఫ్రాంచైజీ ఇండియన్ స్క్రీన్‌పై సంచలన విజయం సాధించింది. ‘గోల్ మాల్: ఫన్ అన్ లిమిటెడ్’, ‘గోల్ మాల్ రిటర్న్స్’, ‘గోల్ మాల్ 3’, ‘గోల్ మాల్ అగైన్’ ఇలా నాలుగు సినిమాలు వరుసగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. చివరిగా ‘గోల్ మాల్ అగైన్’ 2017లో విడుదలై ఘన విజయం సాధించింది.

ఆ తరవాత రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్ ఈ సిరీస్‌ను కొనసాగించలేదు. కానీ ఇప్పుడు ఆయే క్రేజీ కాంబినేషన్ మళ్లీ సెట్ అయ్యింది. ‘గోల్ మాల్ 5’ అధికారికంగా ప్రకటించబడింది. ప్రస్తుతానికి స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పూర్తి స్క్రిప్ట్ సిద్ధమయ్యేందుకు సుమారు ఏడాది సమయం తీసుకుంటామని యూనిట్ చెబుతోంది.

ఇక రోహిత్ శెట్టి ప్రస్తుతం జాన్ అబ్రహాం తో కలిసి రాకేష్ మారియా జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు. ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక వెంటనే ‘గోల్ మాల్ 5’పై పూర్తి దృష్టి పెట్టబోతున్నాడు. 2026లో షూటింగ్ మొదలుపెట్టి, 2027 ప్రారంభంలో సినిమాను రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్.

ఈ అప్డేట్ గోల్ మాల్ అభిమానులకే కాదు, కామెడీ సినిమాల ప్రేమికులకు నిజమైన పండుగవలె మారింది. థియేటర్లలో గోల్మాల్ సినిమాలకెప్పుడూ ప్రత్యేక స్పందన ఉండేది. అజయ్ దేవగన్ కామెడీ టైమింగ్, రోహిత్ శెట్టీ టేకింగ్, supporting క్యారెక్టర్స్ quirky నవ్వులు అందించిన తీరు ఈ ఫ్రాంచైజీని మాస్‌లో ఓ బ్రాండ్‌గా నిలిపాయి. ఇక అజయ్ – రోహిత్ శెట్టి కాంబినేషన్‌లో ‘సింగం’ సిరీస్ కూడా ఉండటం, వీరిద్దరి కాంబోపై అభిమానుల్లోనూ ప్రత్యేక అభిమానం ఏర్పడింది.

‘గోల్ మాల్ 5’ ప్రకటనతో మరలా కామెడీ హంగామా థియేటర్లలో వినిపించబోతుంది.


Recent Random Post: