చంద్రబోస్ చిన్న దొంగతనం 40 లక్షల గ్రంథాలయానికి మారింది

Share


జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఒక్కోసారి మనల్ని గొప్ప పనులు చేయడానికి దారితీస్తాయి. అలాగే ఆస్కార్ అవార్డు గెలిచిన రచయిత చంద్రబోస్ జీవితంలో కూడా ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. చిన్నప్పటి ఒక చిన్న దొంగతనం, ఇప్పుడు ఆయన ఊరికి 40 లక్షల విలువైన గ్రంథాలయాన్ని తెచ్చిపెట్టింది. ఈ కథను చంద్రబోస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

రచయితగా చంద్రబోస్ ఇండస్ట్రీలో పొందిన గుర్తింపు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తర్వాత ఈ స్థాయిలో క్రేజ్ పొందిన రచయిత ఆయనే. పాట రాసే స్టైల్, సంగీతభావాలను పటపటగా అందించగల సామర్థ్యం, ముఖ్యంగా సుకుమార్ వంటి ప్రముఖ దర్శకులు ఇప్పటికే ఆయనతోనే కలిసి పనిచేస్తున్నారు.

చంద్రబోస్ చిన్నప్పటి నుండి పుస్తకాలంటే ప్రాణం పెట్టేవారు. సొంతూరు చల్లగరిగ్లోని స్థానిక గ్రంథాలయానికి రోజూ వెళ్ళేవారు. ఒక రోజు ఆ లైబ్రరీకి కొత్తగా త్రిభాషా నిఘంటువు వచ్చింది. నీలం రంగు కవర్‌తో మెరుస్తున్న ఆ పుస్తకం చూసి ఆయన మనసు ఆగలేదు. ఆ రోజు లైబ్రరీలో ఎవరూ లేని సమయంలో, ఆ పుస్తకాన్ని ఆయన దొంగతనం చేసి ఇంటికి తీసుకెళ్లారు. అప్పట్లో ఆ పుస్తకం ధర కేవలం 40 రూపాయలే.

ఆ పుస్తకం ఆయనతో ఎన్నో ప్రయాణాలు చేసింది. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివేటప్పుడు, తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా ఆ పుస్తకం దగ్గరే ఉంది. అయితే లైబ్రరీ నుంచి పుస్తకాన్ని దొంగిలించానని అపరాధ భావం ఆయనను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది.

అస్కార్ అవార్డు వచ్చిన తర్వాత భార్యతో కలిసి సొంతూరుకు వెళ్ళిన చంద్రబోస్, పాతబడిపోయిన ఆ గ్రంథాలయాన్ని చూసి తిప్పికొట్టుకున్నారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తన సొంత డబ్బు ఖర్చు చేసి ఊరికి ఒక అద్భుతమైన కొత్త గ్రంథాలయాన్ని నిర్మించారు. దానికి అస్కార్ గ్రంథాలయం అని పేరు పెట్టారు.

చంద్రబోస్ ఆనందంగా చెప్పారు,
“నేను దొంగిలించిన ఆ పుస్తకం అప్పట్లో 40 రూపాయలే. కానీ అదే పుస్తకం ఇప్పుడు 40 లక్షల విలువైన గ్రంథాలయాన్ని కట్టించింద. అందుకే ఆ పుస్తకం విలువ ఇప్పుడు 40 లక్షలు.”


Recent Random Post: