చరణ్ కోసం విజయశాంతితో చిరు చర్చలు…!?

Share

మెగాస్టార్ చిరంజీవి మరియు లేడీ బచ్చన్‌ విజయశాంతి లది ఎంతటి సూపర్‌ హిట్ జోడీ అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే. చిరంజీవి ఎంతో మంది హీరోయిన్స్ తో నటించాడు. అయితే అందులో విజయశాంతి చాలా స్పెషల్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయాన్ని చిరంజీవి కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

ఏం జరిగిందో ఏమో కానీ చాలా ఏళ్ల పాటు చిరంజీవి మరియు విజయశాంతి మధ్య మాటలు, పలకరింపులు లేవు. పైగా విజయశాంతి రాజకీయాల వైపు వెళ్లడంతో ఇద్దరికి అసలు ఎక్కడ టచ్ అవ్వలేదు. చాలా ఏళ్ల తర్వాత ఇద్దరూ సరిలేరు నీకెవ్వరు సినిమా వేడుకలో ఎదురు అయ్యారు. ఆ సమయంలో ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకోవడంతో మళ్లీ కలిసి నటిస్తారనే చర్చ మొదలు అయ్యింది.

విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత మళ్లీ సరైన పాత్ర, కథ తారస పడక పోవడంతో ఇన్నాళ్లు కొత్త సినిమాలకు కమిట్‌ అవ్వలేదు. పైగా రాజకీయాలతో వరుసగా బిజీగా ఉండటం, ఇటీవలే ఎన్నికలు పూర్తి అవ్వడంతో విజయశాంతి మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు ఓకే చెప్పింది.

సినీ జనాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం రామ్‌ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో నటించేందుకు గాను విజయశాంతిని సంప్రదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. స్వయంగా చిరంజీవి ద్వారా విజయశాంతితో చర్చలు జరపాలని భావిస్తున్నారట.

చిరంజీవి అడిగితే విజయశాంతి నో చెప్పరు. కనుక మైత్రి మూవీస్ నిర్మాతలు ఇప్పుడు చిరంజీవిని రిక్వెస్ట్‌ చేస్తున్నారని పుకార్లు గుప్పుమంటున్నాయి. ఒక వేళ స్వయంగా చిరంజీవి స్వయంగా అడిగితే కచ్చితంగా రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్ జంటగా నటించబోతున్న సినిమాలో విజయశాంతి నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఖాయం.

ఒక వేళ అదే జరిగితే రామ్‌ చరణ్‌ కు అమ్మ పాత్ర లో వచ్చే ఏడాది విజయశాంతిని చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ పుకార్లు ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే. ఈ వార్తలు నిజం అవ్వాలని మెగా ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.


Recent Random Post:

9 PM | ETV Telugu News | 10th January” 2026

January 10, 2026

Share

9 PM | ETV Telugu News | 10th January” 2026