చిరంజీవి ఫ్యాన్స్ మీట్ వివాదంపై క్లారిటీ

Share


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ హిలేరియస్ ఎంటర్టైనర్‌లో నటించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి 2026కి విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానులపై తన ప్రేమను చాటుకుంటూ ముందుకు సాగుతున్న చిరంజీవి, ఇటీవల మరోసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు.

ఇటీవల లండన్‌ పర్యటనలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి బ్రిటన్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. బ్రిటిష్ పార్లమెంట్‌లో అవార్డు అందుకున్న తర్వాత జరిగిన అభిమాని సత్కార వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, ఈ సందర్భంగా ఓ వివాదం తెరపైకి వచ్చింది.

చిరంజీవిని కలుసుకోవాలనే ఉత్సాహంలో అనేక మంది అభిమానులు ముందుకొచ్చారు. అయితే, కొందరు ఈ అవకాశాన్ని వ్యాపారంగా మార్చేందుకు ప్రయత్నించారని సమాచారం. చిరంజీవితో ఫ్యాన్స్ మీట్ కోసం టికెట్ ఫార్మాట్‌లో డబ్బులు వసూలు చేస్తున్నారని వార్తలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అభిమాన సంఘాలు స్పందించి దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. డబ్బుల కంటే చిరంజీవితో కలిసే అవకాశం నిజమైన అభిమానంతో జరగాలని పలువురు అభిప్రాయపడ్డారు.


ఈ పరిణామాల నేపథ్యంలో చిరంజీవి స్వయంగా స్పందించి ఓ క్లారిటీ ఇచ్చారు. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “నా అభిమానులారా, మీరు నన్ను చూసేందుకు ఎంత ఆసక్తిగా ఉన్నారో నాకు తెలుసు. అయితే, కొంతమంది ఈ మీటింగ్స్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇది పూర్తిగా తప్పు. ఎవరైనా డబ్బులు చెల్లించి ఉంటే, వెంటనే తిరిగి పొందండి. నేను ఇలాంటి చర్యలను ఎప్పుడూ ప్రోత్సహించను. మన బంధం విలువైనది.. అది డబ్బుతో కొలవలేం. దయచేసి ఈ విషయంలో జాగ్రత్త వహించండి” అని పేర్కొన్నారు.

తన పేరును వాడుకొని డబ్బులు వసూలు చేయడం అప్రతిష్టగా మారుతుందని చిరంజీవి స్పష్టంగా తెలియజేశారు. ఆయన తడాఖా చూసిన అభిమానులు, ఆయన వ్యాఖ్యలకు పూర్తిగా అంగీకరించి వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ఫ్యాన్స్‌తో చిరంజీవి కలిగించిన భావోద్వేగ అనుబంధం మరోసారి రుజువైంది.


Recent Random Post: