చిరంజీవి-వెంకీ కాంబినేష‌న్‌లో మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతి హిట్

Share


మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి – సుష్మిత కొణిదెల నిర్మించారు. నయనతార, కేథరిన్ ప్రధాన పాత్రల్లో నటించగా, వెంకీ ఈ సినిమాలో సుమారు 45 నిమిషాల నిడివి ఉన్న కీలక పాత్ర పోషించారు.

గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో వెంకీ మాట్లాడుతూ –
“నేను ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలు చేసాను. మా తమ్ముళ్లు మ‌హేష్‌తో చేసాను, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చేసాను. ఇప్పుడు మెగాస్టార్ చిరు సర్‌తో చేసాను… ఇంతే కాక, సినిమా సౌండ్ ఇంకా ఉండాలి. ఇదే సంక్రాంతి స్పిరిట్” అని చెప్పి ఫ్యాన్స్‌ను ఉత్సాహపరచారు.

వెంకీ చిరంజీవి‌తో పనిచేసిన అనుభ‌వాన్ని వివరించారు –
“చిరు సర్‌తో నటించడం వండర్ ఫుల్ అనుభవం. మేము కలిస్తే ర‌చ్చే ఉంటుంది. కొన్ని చోట్ల నేను కూడా ర‌ఫ్ఫాడేశాను. థాంక్యూ సర్, ఇది గొప్ప అనుభవం” అని అన్నారు.

అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో విజయాలు సాధించిన విషయాన్ని కూడా వెంకీ గుర్తు చేసుకున్నారు –
“దర్శకుడు అనీల్ రావిపూడి కి థాంక్స్… మేము కలిసి చేసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో రచయితల టీమ్, సాంకేతిక నిపుణులు – సమీర్, భీమ్స్, తమ్మిరాజు, ప్రకాష్, సాయి – అందరూ అద్భుతంగా పని చేశారు” అని చెప్పారు. నయనతార కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించిందని ఆయన వ్యాఖ్యానించారు.

మెగాస్టార్ చిరంజీవి వెంకీతో పనిచేసిన అనుభవాన్ని వివరించారు –
“వెంకీని చిన్న సైజు గురువులా ఫీలవుతున్నాను. తన ఏజ్ కంటే ఎక్కువ విషయాలు చెబుతున్నాడు. మనసు ఎంత ప్రశాంతంగా ఉండాలి, ఎలా జీవించాలో చెబుతూ ఎంతో స్ఫూర్తి నింపుతున్నాడు. మేము కలిసిన ఒక ఎపిసోడ్ ఇంత పెద్ద సినిమా అయింది” అన్నారు.

చిరంజీవి వెంకీ పాత్ర గురించి లీక్ ఇచ్చారు –
“వెంకీ ‘నువ్వు వెళ్లు నరుక్కు రా’ అనే సీన్‌లో తన పని చేస్తాడు. చాలా ఉత్సాహంగా, మనదే కదా సంక్రాంతి… ఇర‌గ‌దీద్దాం సంక్రాంతికి” అని పేర్కొన్నారు.


Recent Random Post: