చిరు తో గడిపిన 20 రోజులెన్నటికీ మర్చిపోలేను: చరణ్

Share


పిల్లవయసులో తండ్రితో గడిపే క్షణాలు చాలా విలువైనవి. కానీ ప్రతి ఒక్కరికీ ఆ అదృష్టం కలుగదు, ముఖ్యంగా తండ్రులు బిజీగా ఉంటే. ఇదే అనుభవాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన చిన్ననాటి జీవితంలో చూసాడు. తండ్రి మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్స్‌తో నిత్యం బిజీగా ఉండటం వల్ల, చరణ్‌కి ఆయనతో గడిపే సమయం చాలా తక్కువగా దక్కింది.

చిరు షూటింగ్‌లతో రాత్రివేళ మాత్రమే ఇంటికి వచ్చేవారు, ఉదయానికే మళ్లీ సెట్స్‌కి వెళ్ళిపోవడం… ఈ రొటీన్ వల్ల చరణ్ తండ్రితో ఎక్కువ సమయం గడపలేకపోయాడు. తర్వాత చరణ్‌ స్వయంగా స్టార్ అయిన తర్వాత కూడా, తాను కూడా బిజీగా మారి డాడ్‌తో గడిపే సమయం మరింత తగ్గింది.

అయితే, ‘ఆచార్య’ సినిమాతో ఒక అరుదైన అవకాశం చరణ్‌కు దక్కింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తండ్రితో 20 రోజులపాటు ఒకే గదిలో కలిసి ఉండటం చరణ్ జీవితంలో మరపురాని జ్ఞాపకంగా నిలిచిందంటాడు. షూటింగ్ ఔట్‌డోర్‌లో జరుగుతుండటంతో, వారు ఇద్దరూ ఒకే చోట గడిపారు. అది తన కెరీర్‌లో ఓ ఎమోషనల్ మైలురాయిగా చరణ్ గుర్తుచేసుకుంటున్నాడు.

అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య అనుకున్న విజయం సాధించకపోయినప్పటికీ, చిరు-చరణ్ కలిసి నటించిన ఈ సినిమా వారికి వ్యక్తిగతంగా మాత్రం గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి.


Recent Random Post: