చిరు, సల్మాన్, ఆమీర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారా?

Share


మెగాస్టార్ చిరంజీవికి బాలీవుడ్‌లో మంచి స్నేహితులు ఎవరు? అని అడిగితే, మొదట సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తుంది, ఆ తర్వాత ఆమీర్ ఖాన్. వీరి స్నేహబంధం ఎంత ఘాఢమో, గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ చిరంజీవి కోసం ప్రత్యేక పాత్రలో నటించడం ఇందుకు నిదర్శనం. అంతే కాకుండా, అందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం సల్మాన్ స్నేహానికి అద్దం పడుతుంది.

సల్మాన్ ఖాన్ రేమ్యునరేషన్ గురించి చిరంజీవి సన్నిహితులు ఫోన్ చేయగానే, వారినే ఆగ్రహంతో ఫోన్ పెట్టమని తిట్టినట్టుగా సమాచారం. అంటే చిరంజీవితో సల్మాన్ బంధం ఎంత గాఢమో అర్థం చేసుకోవచ్చు. గాడ్ ఫాదర్ ద్వారా సల్మాన్ తెలుగులో డెబ్యూ కూడా అయిపోయాడు.

ఆమీర్ ఖాన్ – చిరంజీవి స్నేహం కూడా అంతే ప్రత్యేకమైనది. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు ఉన్నా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును చిరంజీవి, ఆమీర్ ఖాన్ చేతుల మీదుగా స్వీకరించడం వారి అనుబంధానికి నిదర్శనం. చిరంజీవి ఒక్క ఫోన్ కాల్ చేస్తే, ఆమీర్ తడిబడిగా హైదరాబాద్‌కి వచ్చేయడం వీరి బంధానికి మరో ఉదాహరణ.

ఇప్పుడు మెగా అభిమానులు చిరు, సల్మాన్, ఆమీర్ ముగ్గురిని ఒకే తెరపై చూడాలనుకుంటున్నారు. ఇలాంటి త్రయం కలిసి నటిస్తే విజువల్ వండర్ లా ఉండదా? అది నిజం కావాలంటే, వీరి ఇమేజ్‌కి తగ్గ మంచి కథ రావాలి. ఆ కథ దొరికితే, చిరంజీవి పిలిస్తే సల్మాన్, ఆమీర్ వచ్చి తెలుగు సినిమా చేయకుండా ఉంటారా? అభిమానుల కోరిక నిజమవుతుందేమో చూడాలి!


Recent Random Post: