విజయ్ సేతుపతి “మహారాజా” గత ఏడాది పెద్ద సంచనల విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకుల అంచనాలు లేకుండా విడుదలై, అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. భారత్ లో హిట్ కావడం పెద్ద విషయం కాకపోయినా, మన భాషలు తెలియని చైనాలో “మహారాజా” బ్లాక్ బస్టర్ కావడం ఒక ప్రత్యేక ఘట్టం.
చైనాలో ఇప్పటి వరకు టాప్ గ్రాసర్స్ బాలీవుడ్ సినిమాలు మాత్రమే. అమీర్ ఖాన్ “దంగల్” 1480 కోట్లతో నెంబర్ 1 స్థానంలో ఉంది, అలాగే అతనే “సీక్రెట్ సూపర్ స్టార్” 840 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో “అందాదున్” 368 కోట్లతో నిలిచింది. ఇతర టాప్ 10 హిట్ సినిమాల్లో “భజరంగి భాయ్ జాన్” (323 కోట్లు), “హిందీ మీడియం” (238 కోట్లు), “హిచ్కీ” (170 కోట్లు), “పీకే” (134 కోట్లు), “మామ్” (130 కోట్లు), “టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ” (108 కోట్లు) ఉన్నాయి. “మహారాజా” 92 కోట్లతో పదో స్థానంలో ఉంది. చైనాలో టాప్ 10 ఇండియన్ సినిమాల్లో దక్షిణాది నుండి వచ్చిన “మహారాజా” ఒక్కటే.
ఫైనల్ రన్ పూర్తవకపోయినప్పుడు, 100 కోట్ల క్లబ్ లో చేరవచ్చేమో అని ఆసక్తిగా చూస్తున్నారు. “బాహుబలి 2” 80 కోట్లతో, “బాహుబలి” 50 కోట్లతో, “ఆర్ఆర్ఆర్” 40 కోట్లతో చివరికి ముగిశాయి. ఈ నేపథ్యంలో “మహారాజా” చైనాలో ఎంతగానో ప్రభావం చూపించిందో అర్థం అవుతుంది.
పెంచుకున్న కూతురు కాకపోయినా, ఒక అమ్మాయి అఘాయిత్యానికి బలైపోయినా, పెంచుకున్న తండ్రి తీర్చుకునే ప్రతీకారం చైనాకు ఒక అందమైన భావోద్వేగంగా కనెక్ట్ అయింది. సీరియస్ టోన్ లో సాగుతున్న ఈ చిత్రం కమర్షియల్ అంశాలకు చోటు ఇవ్వకుండా తీసుకున్న విధానం విమర్శకులను కూడా మెప్పించింది.
చైనాలో టాప్ 10 ఇండియన్ సినిమాలు చూస్తే, మాస్ మసాలా సినిమాలు కనిపించవు. అన్నీ కంటెంట్ ఆధారంగా రూపొందించినవి. విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన మన సినిమాలు అక్కడ సీరియస్ గా తీసుకోబడవు. భావోద్వేగాలు బలంగా ఉంటే చాలు, చైనా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. “మహారాజా” కలెక్షన్లు అదే స్పష్టం చేస్తున్నాయి.
Recent Random Post: