చై క్రష్‌ కథలో సుస్మితా, కలసి నటించాలనుకున్న అలియా!

Share


యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం కెరీర్‌లో పుల్ స్వింగ్‌లో ఉన్నారు. తాజాగా ఆయన నటించిన “తండేల్” మూవీ 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవ్వడంతో, మళ్లీ జోష్ మీదకి వచ్చారు. ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక మిస్టికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం చైతన్య తన లుక్‌లో కూడా కొన్ని స్టైలిష్ మార్పులు తీసుకొచ్చాడు. సరికొత్త అవతారంలో చై కనిపించబోతున్నాడు.

ఇదిలా ఉంటే… చైతన్య ఓపెన్ నేచర్‌కి గుర్తింపు ఉన్న నటుడు. సినిమాల విషయంలో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ చాలా సరళంగా స్పందిస్తుంటాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో, ఏ హీరోయిన్‌తో కలిసి నటించాలని కోరుకుంటున్నారు? అన్న ప్రశ్నకు ఆలస్యించకుండా అలియాభట్ పేరు చెప్పాడు. ఆమె నటన తనకు ఎంతో ఇష్టమని, అవకాశం వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఓకే చేస్తానంటూ చెప్పారు.

ఇంతకీ ఇదేనా హైలైట్ అనుకుంటే… కాదు! అదే ఇంటర్వ్యూలో తన తొలి క్రష్‌ను కూడా రివీల్ చేశాడు. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ అనే పేరును తెగ చుట్టేసాడు చై. అంతే కాకుండా, ఆమెను కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చెప్పినట్టు వెల్లడించాడు. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను మీడియా ముందు షేర్ చేసినా, అసలైన వ్యక్తులకు చెప్పే ధైర్యం చూపించరన్న మాట. కానీ చైతన్య మాత్రం ఆ క్రష్‌ను నిజంగానే సుస్మితకు చెప్పడం విశేషం.

ఇదిలా ఉండగా, సుస్మిత సేన్ 2015లో వచ్చిన “నిర్బాక్” అనే గుజరాతీ సినిమాలో చివరిసారిగా కనిపించారు. కానీ, 2022లో “తాల్” అనే వెబ్ సిరీస్‌తో మళ్లీ బ్యాక్ టూ ఫామ్ అయ్యారు. ఆ సిరీస్ సూపర్ హిట్ కావడంతో అభిమానులు ఆనందపడ్డారు. అయితే ఆ తర్వాత ఆమె వెబ్ ప్రాజెక్ట్స్‌కి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 50కి చేరువలో ఉన్నా కూడా, ఎంతో యాక్టివ్‌గా సోషల్ మీడియాలో కనిపిస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.


Recent Random Post: