జడల లుక్‌తో నాని షాక్ – 150 కోట్ల ప్యారడైజ్

Share


న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య కెరీర్‌లో వరుసగా కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ప్రతి సినిమా తర్వాత మరొక లెవెల్‌లో తన వర్సటాలిటీని చూపించాలని ప్రయత్నిస్తున్న నాని, దసరా విజయంతో మాస్ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ఇప్పుడు అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో భారీ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో నాని జడలతో కనిపించే కొత్త లుక్‌లో ప్రేక్షకులకు షాక్ ఇవ్వబోతున్నాడని టాక్. ఇప్పటివరకు కనిపించని వేరియేషన్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలే తెప్పిస్తాడని ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా, ఈ సినిమా నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్. మొత్తం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు నాని సినిమాల్లో హయ్యెస్ట్ బడ్జెట్ సుమారు 70 కోట్లే ఉండగా, ది ప్యారడైజ్ దానికి డబుల్‌గా ప్లాన్ అవ్వడం సెన్సేషన్‌గా మారింది.

నాని మీద ఉన్న నమ్మకమే నిర్మాతలను ఇంత పెద్ద రిస్క్‌కి ఒప్పించిందని ఇండస్ట్రీ టాక్. అలాగే నాని కూడా ప్రతి సినిమాకు తన మొదటి సినిమా లాగా కష్టపడతానని ముందే చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ విషయంలో అయితే మాస్ డోస్‌ను మరింత పెంచి, ఆడియన్స్‌కు నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.

దసరాతో శ్రీకాంత్ ఓదెల చూపించిన మాస్ ట్రీట్‌కి డబుల్ ఇంపాక్ట్‌తో ది ప్యారడైజ్ రూపొందుతోందట. అందుకే ఈ సినిమా కమర్షియల్ రేంజ్‌లోనే కాకుండా, నాణ్యత పరంగా కూడా ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. నాని, శ్రీకాంత్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్ మాస్ + క్లాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతుందని చెప్పొచ్చు.


Recent Random Post: