జయం రవి విడాకుల డ్రామా: మూడో వ్యక్తి కారణమా?

Share


కోలీవుడ్ నటుడు జయం రవి మరియు ఆయన భార్య ఆర్తి మధ్య వివాహ సమస్యలు మరింత ముదురుతున్నాయి. ప్రస్తుతం విడాకుల కేసు విచారణలో ఉన్న ఈ జంట, తరచూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలనంగా మారుతున్నారు. ఇటీవల జయం రవి అత్తమ్మ చేసిన వ్యాఖ్యలు—”అల్లుడిని హీరోగా నిలబెట్టేందుకు 100 కోట్లకు పైగా అప్పు చేశాం” అనే వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

ఇదిలా ఉంటే, తాజాగా ఆర్తి రవి తన ఇంటిగ్రామ్ నోట్ల ద్వారా మరోసారి తన ఆవేదనను వ్యక్తం చేశారు. “మా వివాహానికి డబ్బు, అధికారం, నియంత్రణ కారణం కాదు. మా మధ్య మూడో వ్యక్తి ప్రవేశమే ఈ బంధాన్ని చెదగొట్టింది,” అని ఆర్తి వ్యాఖ్యానించారు. జయం రవి – కెనీషా అనే మానసిక నిపుణురాలితో ఇటీవల ఒక పెళ్లిలో కనిపించిన ఫోటోలు వైరల్ కావడం, ఆ తర్వాత వచ్చిన ఆర్తి ఈ పోస్టులు వీటిని సమర్థించాయి.

ఆమె మాట్లాడుతూ – “మీ జీవితంలో వెలుగు మా జీవితంలో చీకటిని తీసుకొచ్చింది. విడాకుల పత్రాలు దాఖలు చేసే ముందు నుంచే ఆ వ్యక్తి మా మధ్య ప్రవేశించింది. ఇది ఊహ కాదు, నాతో సాక్ష్యాలు ఉన్నాయి,” అంటూ వ్యాఖ్యానించారు. “ఒక్కసారి వెళ్లిపోయి తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటే, పరిస్థితి వేరుగా ఉండేది. కానీ, ఆమె తలుపు తట్టడం మా జీవితాన్ని తలకిందులు చేసింది,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

జయం రవి మాత్రం తన వైపు నుంచి స్పందిస్తూ – “కెనీషా నా స్నేహితురాలు మాత్రమే. ఆమె వద్ద మానసిక చికిత్స కోసం వెళ్లాను,” అని గతంలో చెప్పిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నాడు.

ఈ వివాదం ఇంకా ఎటు తేలనప్పటికీ, అభిమానులు మాత్రం వారి వ్యక్తిగత జీవితంలోకి మిగిలిన ప్రపంచం తలదూర్చకూడదనే అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.


Recent Random Post: