జాతీయ అవార్డు వ‌చ్చాక గ‌ర్వం త‌ల‌కెక్కింది: సీనియ‌ర్ హీరో

ఇటీవలే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కారం అందుకున్న‌ వెట‌ర‌న్ న‌టుడు మిథున్ చక్రవర్తి సినీ పరిశ్రమలో తన ప్రయాణం గురించి, కొన్ని అనూహ్య ఘ‌ట‌న‌ల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. తాను కెరీర్ ఆరంభం ముంబై ఫుట్‌పాత్‌లపై పడుకోవడం సహా క‌ష్ట కాలంలో ఆరంభ పోరాటాలను గుర్తు చేసుకున్నారు. తన తొలి చిత్రం `మృగయా`కు జాతీయ అవార్డును గెలుచుకున్న తర్వాత త‌న‌కు అహంకారం త‌ల‌కెక్కింద‌ని మిథున్ అంగీక‌రించారు. అనుభవం వ‌ల్ల‌ కెరీర్ టేకాఫ్ అయినా కానీ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల్సిన అవ‌స‌రం, ప్రాముఖ్యతను నేర్పిందని తెలిపాడు.

న‌టుడిగా ప్రారంభ రోజుల్లో ప్ర‌యాణం చాలా కష్టమైనదని ఆయ‌న‌ అన్నారు. కొంద‌రు తనను జీవిత చరిత్ర రాయమని సూచించారని, అయితే తన కథ స్ఫూర్తిని కలిగించే బదులు నిరుత్సాహానికి గురిచేస్తుందని భావించిన‌ట్టు చెప్పాడు. నా జీవిత ప్ర‌యాణం చాలా కష్టంతో కూడుకున్న‌ది.. చాలా బాధాకరమైనది. నేను కోల్‌కతాలోని బ్లైండ్ లేన్ నుండి వచ్చాను. బొంబాయి చాలా కష్టమైన చోటు. ఒకరోజు నాకు తిండి కూడా దొర‌క‌ని స్థితి ఉంది. కొన్నిసార్లు ఫుట్‌పాత్‌లపై పడుకున్నాను. ఈ ప్రయాణం చాలా కష్టంగా సాగింది. చాలా మంది నన్ను జీవిత చరిత్ర ఎందుకు రాయకూడదని అడుగుతారు. నా కథ ప్రజలను ప్రేరేపించదు.. నైతికంగా వారిని దిగజార్చుతుంది కాబట్టి నేను నో చెప్పాను. ఇది పోరాడుతున్న యువకుల మనోభావాలను విచ్ఛిన్నం చేస్తుంది.. అని మిథున చ‌క్ర‌వ‌ర్తి అన్నారు.

అలాంటి (ఫుట్ పాత్ పై నిదురించిన‌) ఒక‌ అబ్బాయి సినీరంగంలోని భారతదేశపు అతిపెద్ద అవార్డును గెలుచుకోవడం నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. నేను ఇంకా మ‌త్తులో ఉన్నాను.. ఇంత పెద్ద అవార్డు నాకోసం. నేను ఆశ్చర్యపోయాను.. నేను ఇంకా దాని నుండి బయటపడలేదు! అని మిథున్ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసారు.

మిథున్ చక్రవర్తి తన కెరీర్ ప్రారంభంలో జాతీయ అవార్డును గెలుచుకోవడం అహంకారానికి ఎలా దారితీసిందో చెబుతూ… నాకు మొదటి జాతీయ అవార్డు ద‌క్క‌గానే నేను అల్ పాసినో లాగా నటించడం ప్రారంభించాను. నేనే గొప్ప నటుడినని అనిపించింది. నా వైఖరి మారింది.. కాబట్టి నిర్మాతలు దీనిని చూసి బ‌య‌ప‌డ్డారు.

అప్పుడు నాకు నా తప్పు అర్థమైంది… అని నిజాయితీగా చెప్పారు. మిధున్ చక్రవర్తి ప్రముఖ హిందీ నటుడు. జన్మతహ బెంగాలీ అయినప్పటికీ హిందీ చిత్రాలలో రాణించాడు. డిస్కో డాన్సర్ చిత్రం ద్వారా ఖ్యాతి పొందాడు. పలు పురస్కారాలు కూడా సాధించాడు. మిధున్ చక్రవర్తికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌ అవార్డును ప్రకటించింది.


Recent Random Post: