జానీ మాస్ట‌ర్ కంబ్యాక్ గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడా?

అత్యాచారం ఆరోపణ కేసులో కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ అరెస్ట్ ఆ మధ్య ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ఈ కేసు ప‌డ‌టంతో చేతి వ‌ర‌కూ వ‌చ్చిన జాతీయ అవార్డు సైతం రాకుండా పోయింది. అందుకోవ‌డానికి అన‌ర్హుడంటూ అవార్డు చేజారింది. కోర్టు అవార్డు కోసం మ‌ధ్యంతర బెయిల్ ఇచ్చినా క‌మిటీ తిర‌స్క‌రించ‌డంతో జానీ ఎంతో నిరుత్సాహ‌నికి గుర‌య్యాడు. వ‌చ్చిన బెయిల్ సైతం ర‌ద్దు చేయించుకున్నాడు.

ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో జానీ మ‌ళ్లీ వృత్తి ప‌రంగా బిజీ అయ్యే ప‌నిలో ప‌డ్డాడు. మ‌ళ్లీ ప్రాక్టీస్ షురూ చేసాడు. `బ్యాక్ టూ ది బీట్స్ ఇన్ పుల్ వాల్యూమ్` అని ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసాడు. త్వ‌ర‌లోనే బిగ్ అప్ డేట్స్ వ‌స్తాయ‌ని తెలిపాడు. దీంతో జానీ తిరిగి మ‌ళ్లీ త‌న డాన్స్ స్టూడియోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. జానీ ఈజ్ బ్యాక్ అనిపించేలా స‌మ‌యత్తం అవుతున్నాడు.

త‌న డాన్స్ టీమ్ తో క‌లిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇండ‌స్ట్రీలో జానీ మాస్ట‌ర్ కూడా ఎలాంటి స‌పోర్ట్ లేకుండా ఎదిగిన కొరియోగ్రాఫ‌ర్. అత‌డిలో ఫ్యాష‌న్ గురించి స్టార్ హీరోలు ప్రోత్స‌హించ‌డంతోనే పెద్ద కొరియోగ్రాఫ‌ర్ గా ఎదిగాడు. అయితే అత్యాచారం చేసాడ‌ని త‌న వ‌ద్ద శిష్య‌రికం చేసిన అమ్మాయే కేసు పెట్ట‌డంతో అది నెగిటివ్ గా మారింది. దీంతో `పుష్ప‌2` సినిమా నుంచి జానీని మేక‌ర్స్ తొల‌గించారు.

మ‌రి ఇప్పుడు కొత్త‌గా బిగ్ అప్ డేట్స్ ఇస్తానంటూ జానీ ప్రామిస్ చేసిన నేప‌థ్యంలో తాను చేయ‌బోయే సినిమాలు ఎలా ఉంటాయి అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. జానీ మాస్టార్ ఇప్ప‌టికే టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలంద‌రికీ డాన్స్ కొరియోగ్ర‌ఫీ చేసాడు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరోల‌కు సైతం డాన్సు మాస్ట‌ర్ గా ప‌నిచేసాడు. అక్క‌డా మంచి పేరు తెచ్చుకున్నాడు. మ‌రి కంబ్యాక్ లో ఎలాంటి సినిమాలకు ప‌నిచేస్తాడో చూడాలి.


Recent Random Post: