
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 2018లో విడుదలైన దడక్ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. ప్రముఖ నటి శ్రీదేవి వారసురాలిగా వచ్చిన జాన్వీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఆమె చేసిన పాత్ర ప్రధానమైన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయాయి.
ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాతో జాన్వీ తెలుగు తెరపై హీరోయిన్గా పరిచయమైంది. ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా ద్వారా జాన్వీకి తెలుగు ప్రేక్షకుల మన్ననలు దక్కాయి.
ఇదిలా ఉంటే, జాన్వీ కపూర్ ప్రేమ జీవితం గురించిన వార్తలు కూడా గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. వ్యాపారవేత్త శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్లో ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. శిఖర్ పహారియా, మాజీ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు కావడం విశేషం. ఆయన సోదరుడు వీర్ పహారియా సినీ నటుడిగా ఉన్నాడు.
ఇటీవల బోనీ కపూర్ బర్త్‌డే వేడుకల్లో శిఖర్ కూడా కుటుంబ సభ్యుడిలా పాల్గొనడం, జాన్వీతో కలిసి కనిపించడం ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, వీరిద్దరి బంధం అధికారికమైందన్న టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం రంగస్థలం కంటే పెద్ద స్థాయిలో ఉండబోతుందని టాక్. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమా 2026 మార్చిలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.
Recent Random Post:














