జీవితంలో ఏం సాధించావ్ అంటే ఇక‌పై అదే చెబుతా?

ఇటీవ‌ల రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం `క‌ల్కి 2898` భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. సినిమాలో టెక్నిక‌ల్ అంశాల్ని ప‌క్క‌న‌బెడితే నాగ్ అశ్విన్ తీసుకున్న పాత్ర‌లు, భ‌గ‌వ‌ద్గీత‌కు ముడిపెట్టి తీసిన విధానం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కురిపించింది. సృష్టిలో ఏదో జ‌రుగుతోంది? దానికి కార‌ణం ఏంటి? సైన్స్ తో సృష్టి ధ‌ర్మం ఎంత‌వ‌ర‌కూ ముడిప‌డి ఉంద‌న్న విష‌యంలో ఎలాంటి క‌న్ ప్యూజ‌న్ లేకుండా చూపించాడు.

ఇక సినిమాలో న‌టుడు అర్జున్ దాస్ శ్రీకృష్ణుడి పాత్ర‌కి వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం అన్న‌ది హైలైట్ గా నిలిచింది. బేసిక్ గానే అర్జున్ దాస్ వాయిస్ కి ప్ర‌త్యేక‌మైన ఫాలోయింగ్ ఉంది. ఆ వాయిస్ ని లైక్ చేసే వారెంతో మంది. `విక్ర‌మ్` సినిమాతో అతడికి మంచి గుర్తింపు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కృష్ణ పాత్ర‌కు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డంపై అర్జున్ దాస్ స్పందించాడు. `అమితాబ్ బచ్చన్ ఎదురుగా ఉన్నా? శ్రీకృష్ణుడికి డబ్బింగ్ చెప్పాలని స్వప్న దత్ ఫోన్ చేసినప్పుడు టెన్షన్ పడ్డాను.

హైదరాబాద్ వచ్చాక నాగ్ అశ్విన్ దగ్గరుండి నాలో భయాన్ని పోగొట్టి చెప్పించిన తీరు జీవితంలో మర్చిపోను. చిన్న‌ప్ప‌టి నుంచి అమితాబ‌చ్చ‌న్ అభిమానిని. ఆయ‌న చూస్తూ పెరిగాను. ఆయన్ని ఉద్దేశించి డైలాగులు చెప్ప‌డం జీవితంలో మ‌ర్చిపోలేను. ఇక‌వ‌పై ఎవ‌రైనా జీవితంలో నువ్వేం సాధించావ్? అంటే బిగ్ తో క‌లిసి క‌ల్కిలో మాట్లాడాను అని గ‌ర్వంగా చెబుతాను. స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల తెలుగు, హిందీ వెర్ష‌న్ల‌కు మాత్రమే డ‌బ్బింగ్ చెప్పాను` అని అన్నాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న `ఓజీ` టీజ‌ర్ కి కూడా అర్జున్ దాస్ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అత‌డి వాయిస్ ఓవ‌ర్ టీజ‌ర్ చాలా ప్ల‌స్ అయింది. అత‌డికి అవ‌కాశాలు రావ‌డం వెనుకు అత‌డి గొంతు కూడా కీల‌క పాత్ర పోషిస్తుంది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ దాస్ తెలుగులో హీరోగా సినిమాలు కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.


Recent Random Post: