కరోనా ఎఫెక్ట్ సినీపరిశ్రమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. ఈ రంగంమీద ఆధారపడి బతుకుతున్న లక్షలాదిమంది జీవితం దుర్భరంగా మారింది. స్టార్ ప్రొడ్యూసర్లు హీరోలు దర్శకులకు ఏ ఇబ్బంది లేదు. కానీ రోజువారి పనిచేసుకొని కార్మికులు కాలే కడుపుతో కష్టాలు పడుతున్నారు. ఈ రంగం మీద పరోక్షంగా ఆధారపడి బతుకే థియేటర్లలో పనిచేసే కార్మికులు క్యాంటిన్ నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అయితే జూనియర్ ఆర్టిస్టుల జీవితం మరింత దుర్భరంగా మారింది.
సినిమా పరిశ్రమ మాంచి ఊపుమీద ఉన్నప్పుడే వాళ్లు ఎన్నోకష్టాలను పడుతుంటారు. అటువంటిది ఇప్పుడు సినిమా షూటింగ్లు చాలా మేరకు తగ్గిపోయాయి.
ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికి సరైన మార్కెట్ ఉంటుందో లేదో తెలియక సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. దీంతో చిన్నచిన్నవేషాలు వేసే జూనియర్ ఆర్టిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరబాద్లో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తున్న నమో కిరణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ ఆత్మహత్యకు ప్రేమవిఫలం కావడం ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తున్నది. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. కిరణ్ మృతికి పలువురు జూనియర్ ఆర్టిస్టులు సంతాపం తెలిపారు. అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కిరణ్ లాంటి ఎందరో జూనియర్ ఆర్టిస్టులు హైదరాబాద్లో కష్టాలు అనుభవిస్తున్నారు. వారికి ప్రభుత్వాలు సినీపెద్దలు మా అసోషియేషన్ సహకారం అందించాలని కోరుతున్నారు.
Recent Random Post: