
తమిళనాడులో టాస్మాక్ (TASMAC) వ్యవస్థలో చోటు చేసుకున్న వేల కోట్ల లిక్కర్ కుంభకోణం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను, సినీ పరిశ్రమను ఒక్కసారిగా ఊపేస్తోంది. దాదాపు రూ.1000 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు చెన్నైలో విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఈ దాడుల్లో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో, సినీ రంగానికి చెందిన కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో, యువ నటి కయాదు లోహర్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈడీ దర్యాప్తులో భాగంగా విచారణకు లోనైన కొందరు వ్యక్తులు, టాస్మాక్ లిక్కర్ డీలింగ్కు సంబంధించిన హై-ప్రొఫైల్ పార్టీల్లో కయాదు హాజరయ్యారని, ఆమెకు ఆ పార్టీకి రూ.35 లక్షలు చెల్లించారని పేర్కొన్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించకపోయినా, సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది. ఇప్పటికే ‘డ్రాగన్’, ‘విరూపాక్ష’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందిన కయాదు, ప్రస్తుతం తమిళ హీరోలు అధర్వ, జీవీ ప్రకాష్, శింబులతో ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
ఈ సమయంలో ఇలాంటి ఆరోపణలు వినిపించడం ఆమె కెరీర్‌పై నెగటివ్ ప్రభావం చూపిస్తుందేమోనన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. పైగా ఈ ఆరోపణలపై కయాదు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడం గమనార్హం.
ఇప్పటికి ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఇదయం మురళి’, ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో అధర్వ, థమన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే కయాదు ప్రస్తుతం పలు తెలుగు, తమిళ చిత్రాల కోసం చర్చల దశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఆరోపణలు కేవలం పుకార్లవా? లేక వాస్తవం ఏమన్నా ఉందా? అనేది కయాదు స్పందనతో స్పష్టతకు రావాల్సి ఉంది. అయితే, ఈ స్కాంలో సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తుండటంతో తెలుగు-తమిళ పరిశ్రమలో కలకలం రేగుతోంది.
Recent Random Post:















