
పర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రాబోతోన్న డాన్ 3 కోసం అన్ని ఏర్పాట్లు సిద్దమవుతున్నాయి. రణవీర్ సింగ్ హీరోగా, కియారా అద్వాణీ హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవ్వాల్సి ఉన్నా, కియారా గర్భవతి కావడంతో కొంత ఆలస్యం అయింది. కియారా ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అసలు ఆమె ప్రసవం ఆగస్టులో ఉండాల్సి ఉండగా ముందుగానే డెలివరీ అయింది. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో జనవరిలో షూటింగ్ ప్రారంభించాలని పర్హాన్ ముందుగా ప్లాన్ చేసినప్పటికీ, ఇప్పుడు షూటింగ్ డిసెంబరులోనే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కియారా ఆరోగ్యంగా ఉండటంతో ఆమె త్వరగా సెట్స్‌కి రాబోతుందని తెలుస్తోంది.
ఇక రణవీర్ సింగ్ విషయానికి వస్తే, ఆయన ఇటీవలే ధురంధర్ అనే సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా డిసెంబర్లో విడుదల కానుండటంతో అప్పటివరకు రణవీర్ డబ్బింగ్ పూర్తిచేయడం మినహా పెద్దగా ఇతర పనులుండవు. అందువల్ల డాన్ 3 షూటింగ్‌కు ఆయన పూర్తిగా అందుబాటులో ఉండనున్నారు. ప్రస్తుతం రణవీర్ సింగ్ కూడా డాన్ 3 ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటున్నట్టు సమాచారం.
కియారా కూడా ఆరోగ్యంగా సెట్స్‌పైకి వస్తే, డాన్ 3 డిసెంబరులోనే షురూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పర్హాన్ అక్తర్ ఈసారి భారీ స్థాయిలో సినిమా తెరకెక్కించబోతున్నాడు.
Recent Random Post:















